ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి తెలంగాణ పరువు తీస్తున్నారని ఎమ్మెల్సీ కవిత చేసిన వ్యాఖ్యలకు మంత్రి సీతక్క ఘాటుగా స్పందించారు. ఈ సందర్భంగా సీతక్క మాట్లాడుతూ.. తెలంగాణ పరువు తీసింది.
తీస్తున్నది మీ కుటుంబమే అని అన్నారు. ‘మాకు ఢిల్లీ వ్యాపారాలు తెలియవు. ఢిల్లీ వ్యాపారాలతో
రాష్ట్రం పరువు తీసింది మీరు, మీ కుటుంబం కాదా’ అని ప్రశ్నించారు. కాంగ్రెస్ పార్టీది త్యాగాల చరిత్ర అని అన్నారు. కరప్షన్కి కేరాఫ్ అడ్రస్ బీఆర్ఎస్ అని విమర్శించారు. ప్రజలు పదేళ్లు అధికారం ఇస్తే.. పదేళ్ల పాటు అడుగడుగునా అన్యాయం చేశారని మండిపడ్డారు.
మొదటి ఐదు సంవత్సరాల్లో మంత్రి పదవిలో మహిళలు లేరు, మహిళా కమిషన్ కు సభ్యులు లేరు. మహిళలు పొదుపు చేసుకున్న రూ.1800 కోట్ల అభయ హస్తం నిధులు ఇవ్వలేదు. పావలా వడ్డీ ఇవ్వలేదు. మహిళా సంఘాలకు ఇవ్వాల్సిన రూ.3700 కోట్ల వడ్డీలు చెల్లించలేదు ఇలా చెప్పుకుంటూ పోతే అనేకం ఉన్నాయని స్ట్రాంగ్ కౌంటర్ ఇచ్చారు.