వివేకా హత్య కేసు.. తెలంగాణ హైకోర్టులో సునీత పిటిషన్‌

-

మాజీ మంత్రి వైఎస్‌ వివేకా హత్య కేసు విచారణలో మరో కీలక పరిణామం చోటుచేసుకుంది. ఈ కేసులో మరోసారి ఆయన కుమార్తె సునీత తెలంగాణ హైకోర్టును ఆశ్రయించారు. సీబీఐని ప్రతివాదిగా చేర్చుతూ.. సీబీఐ కోర్టులో తన తండ్రి వివేకా హత్య కేసును రోజువారీగా విచారించేలా ఆదేశించాలని న్యాయస్థానంలో పిటిషన్ దాఖలు చేశారు. ఈ వ్యాజ్యంపై హైకోర్టు ప్రత్యేక ధర్మాసనం విచారణ చేపట్టింది.

2019 మార్చి 14న అర్ధరాత్రి వివేకా హత్య జరగగా.. విచారణ చేపట్టిన సీబీఐ ఇప్పటికే రెండు ఛార్జిషీట్లు దాఖలు చేసింది. సీబీఐ అధికారులు కొన్ని పత్రాలకు సంబంధించి హార్డ్‌ డిస్క్‌లో ప్రతివాదుల తరఫు న్యాయవాదులకు ఇచ్చారు. అవి ఓపెన్ కాకపోవడం వల్ల ప్రింటింగ్ ప్రతులు కావాలని కోరారు. లక్షల పేజీలు ఉండటం వల్ల ప్రింటింగ్ కాపీలు ఇవ్వడం కుదరదు కాబట్టి హార్డ్ డిస్కులు ఓపెన్ చేయాలని సీబీఐ అధికారులు చెబుతున్నారు. దీనివల్ల దాదాపు 15 నెలలుగా విచారణ ముందుకు సాగడం లేదు. ఆరు నెలల్లో ఈ విచారణ ముగించేలా ఆ కోర్టును ఆదేశించండి. అని సునీత తరఫు న్యాయవాది హైకోర్టును కోరారు.

Read more RELATED
Recommended to you

Latest news