అనసూయ, సుమ మధ్య ఆధిపత్య పోరు నడుస్తుందా…?

-

తెలుగు బుల్లి తెర మీద అడుగు పెట్టిన తక్కువ కాలంలోనే మంచి గుర్తింపు తెచ్చుకున్న యాంకర్లు సుమా, అనసూయ. అనసూయ కంటే సుమా చాలా సీనియర్. ఇద్దరి మధ్య దాదాపు పదేళ్ళకు పైగా గ్యాప్ ఉంది. ఇద్దరికీ పెళ్లి అయినా సరే ఇద్దరూ కూడా యాంకరింగ్ లో సత్తా చాటుతూనే ఉన్నారు. ఇద్దరి మధ్య ఇటీవల అభిప్రాయ భేదాలు వచ్చాయని ఇప్పుడు టాలీవుడ్ లో వార్తలు వస్తున్నాయి.

Anasuya Fire On Anchor Suma
Anasuya Fire On Anchor Suma

టాలీవుడ్ లో ఎక్కువగా సినిమా కార్యక్రమాలను సుమా చేస్తుంది. అనసూయకు అవకాశాలు వస్తున్నా సుమా తన్నుకుపోతుంది అనే వ్యాఖ్యలు వినపడుతున్నాయి. సుమా విషయంలో అనసూయ కాస్త దూకుడుగా ఉండటమే దీనికి కారణమని అంటున్నారు. అనసూయకు కాస్త గ్లామర్ ఎక్కువ. దీనితో ఆమెకు యూత్ లో ఫాలోయింగ్ ఎక్కువ. అవకాశం వస్తే తాను చీరకట్టులో అలరిస్తాను అని చెప్తుంది. అయినా సరే ఆమెకు అవకాశాలు రావడం లేదట.

ఇటీవల ఒక ప్రముఖ ఛానల్ లో నిర్వహించే టీవీ షో విషయంలో ఇద్దరి మధ్య విభేదాలు వచ్చాయని అంటున్నారు. ముందు అనసూయను సంప్రదించగా ఆ తర్వాత సుమా ఆ షో కి గ్రీన్ సిగ్నల్ ఇస్తూ సందేశం పంపింది. తన రేట్ తగ్గించే ఆ షో కి ఓకే చెప్పిందట. దీనితో అనసూయను పక్కన పెట్టి సుమా ఇమేజ్ ఎక్కువ కాబట్టి ఆమెను తీసుకోవాలని భావించారు. దీనితో అనసూయ ఇప్పుడు సుమా మీద ఆగ్రహంగా ఉండి అసలు ఆ ఛానల్ నుంచే తాను పూర్తిగా బయటకు రావాలని భావించింది అంటున్నారు.

Read more RELATED
Recommended to you

Latest news