గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరమే లేదు. మగధీర సినిమా నుంచి అధిక స్థాయిలో అభిమానులను సంపాదించుకున్నారు. ఇక RRR తరువాత దేశ, విదేశాల్లో భారీ స్థాయిలో అభిమానులు ఏర్పడ్డారు. RRR మూవీ తరువాత అటు ఎన్టీఆర్, ఇటు రామ్ చరణ్ క్రేజ్ ప్రపంచ వ్యాప్తంగా పెరిగింది. పలు సందర్భాల్లో అభిమానులు రామ్ చరణ్ ను కలుస్తుంటారు. గేమ్ ఛేంజర్ విడుదలైన సందర్భంగా పలువురు అభిమానులు చరణ్ కలిశారట.
ఇప్పుడే కాదు.. గతంలో కూడా పలు సందర్భాల్లో చరణ్ కలిసేవారు. తాజాగా ఓ అభిమాని విజయవాడ నుంచి హైదరాబాద్ కు పాదయాత్ర ద్వారా రామ్ చరణ్ ను కలిసేందుకు వస్తున్నారు. తన అభిమాన హీరోకి సంబంధించిన పోస్టర్ పట్టుకొని విజయవాడ నుంచి బయలుదేరాడు. విజయవాడ నుంచి హైదరాబాద్ పాదయాత్ర జనసేన సైనికుడు అనే బోర్డుతో దాదాపు వారం రోజులుగా పాదయాత్ర చేస్తున్నాడు చరణ్ అభిమాని. శ్రీకాకుళం రాజాంకి చెందిన శేఖర్ దాదాపు 8 రోజులుగా పాదయాత్ర చేశాడు. రామ్ చరణ్ ను కలిసేందుకు జాతీయ జెండా, ప్లకార్డులు పట్టుకొని పాదయాత్ర చేశాడు. తన అభిమాన నటుడు చరణ్ ను ప్రత్యక్స్యంగా కలిసేందుకు దాదాపు 250 కిలోమీటర్ల దూరం నడుస్తూ వచ్చాడు శేఖర్.