పరీక్షల సమయంలో ఒత్తిడి తగ్గాలంటే.. వీటిని ఫాలో అవ్వాల్సిందే..!

-

పరీక్షలు కు సిద్ధమవుతున్న ప్రక్రియలో ఎంతో ఒత్తిడికి గురి అవివాదం సహజమే. ముఖ్యంగా పరీక్షలకు ముందుగానే ఆందోళన వంటి సమస్యలు ఎక్కువ అవుతాయి. అలాంటప్పుడు సరైన ఏకాగ్రత కూడా ఉండదు. కనుక ఒత్తిడి తగ్గించడానికి ప్రయత్నించి తగిన జాగ్రత్తలు తీసుకుంటూ ఉండాలి. పరీక్షలు సమయంలో కొన్ని రకాల టిప్స్ ను పాటించడం వలన పరీక్ష సమయంలో వచ్చే ఒత్తిడిని తగ్గించుకోవచ్చు. ప్రతిరోజు మానసిక ఆరోగ్యం బాగుండే విధంగా చూసుకోవాలి, ముఖ్యంగా మెడిటేషన్ వంటివి చేయాలి.

దీంతో ఒత్తిడి తగ్గించుకోవచ్చు మరియు ఏకాగ్రతను పెంచుకోవచ్చు. పైగా ప్రతిరోజు మెడిటేషన్ చేయడం వలన జ్ఞాపకశక్తి కూడా పెరుగుతుంది. ఒత్తిడిని తగ్గించుకోవడానికి ఒమేగా త్రీ ఫ్యాటీ యాసిడ్స్ ఎంతో సహాయపడతాయి అని చెప్పవచ్చు. కనుక ప్రతిరోజు ఆహారంలో భాగంగా ఒమేగా త్రీ ఫ్యాటీ యాసిడ్స్ ఉండేటువంటి నట్స్, సీడ్స్, పండ్లు, కూరగాయలు వంటివి తప్పకుండా తీసుకోవాలి. ఇలా చేయడం వలన ఒత్తిడి తగ్గడానికి మాత్రమే కాకుండా పూర్తి ఆరోగ్యానికి కూడా ఎంతో ఉపయోగపడుతుంది. పరీక్షలకు ముందు ఒత్తిడితో పాటు నిద్రకు సంబంధించిన సమస్యలు కూడా వస్తాయి. ఎప్పుడైతే సరైన విధంగా నిద్రపోతారో మైండ్ ఎంతో ప్రశాంతంగా ఉంటుంది మరియు మానసిక ఆరోగ్యం కూడా మెరుగ్గా ఉంటుంది.

చాలా శాతం మంది పరీక్షలు ఉన్నాయి అని ఒకే ప్రదేశంలో కూర్చుని గంటలు పాటు చదువుతూ ఉంటారు. అలా కాకుండా చిన్న చిన్న బ్రేక్స్ ను తీసుకుంటూ చదువుకోవాలి. ఈ విధంగా బ్రేక్స్ తీసుకోవడం వలన ఒత్తిడి తగ్గుతుంది మరియు మైండ్ ఎంతో రిలాక్స్ అవుతుంది. ఒత్తిడి తగ్గడానికి వ్యాయామాలు కూడా ఎంతో సహాయపడతాయి. కొన్ని రకాల వ్యాయామాలు చేయడం వలన శరీరంలో ఫీల్ గుడ్ హార్మోన్లు ఉత్పత్తి అవుతాయి. దీంతో మెదడు ఎంతో ప్రశాంతంగా పనిచేస్తుంది. కనుక పరీక్షలు సమయంలో ఇటువంటి టిప్స్ ను పాటించి ఒత్తిడిని తగ్గించుకోండి.

Read more RELATED
Recommended to you

Latest news