పెళ్లికి సిద్ధమవుతున్న అంజలి.. డేట్ ఫిక్స్..!

-

తెలుగు హీరోయిన్ అంజలి ఎట్టకేలకు వివాహం చేసుకోబోతోంది అంటూ ఒక వార్త ఇప్పుడు సోషల్ మీడియాలో చాలా వైరల్ గా మారుతోంది. తెలుగమ్మాయి అయినా అంజలికి తెలుగులో అవకాశాలు రాలేదు. కానీ కోలీవుడ్లో మాత్రం వరుస అవకాశాలు అందుకుంటూ అక్కడ భారీ పాపులారిటీ అందుకుంది. ఈ మధ్యకాలంలో తెలుగులో సెకండ్ హీరోయిన్ గా అవకాశాలు అందుకుంటున్న ఈ ముద్దుగుమ్మ ప్రస్తుతం రామ్ చరణ్ , శంకర్ కాంబినేషన్లో వస్తున్న RC 15 సినిమాలో ఈ ముద్దుగుమ్మ కీలక పాత్రలో నటిస్తున్న విషయం తెలిసిందే. అయితే ఈ సినిమా పూర్తి అయిన వెంటనే ఈమె పెళ్లికి సిద్ధమవుతోంది అంటూ వార్తలు బాగా వైరల్ అవుతున్నాయి.

గతంలో ఒక కోలీవుడ్ డైరెక్టర్ తో ప్రేమాయణం నడుపుతోంది అంటూ వార్తలు బాగా షికారులు చేయగా అందులో నిజం లేదు అంటూ స్పష్టం చేసింది ఈ ముద్దుగుమ్మ. ప్రస్తుతం అంజలి తన తల్లిదండ్రులు చూసిన అబ్బాయిని వివాహం చేసుకోవడానికి సిద్ధమవుతోందట. రాజోలుకు చెందిన ఈ ముద్దుగుమ్మ పెళ్లి పీతలెక్కబోతోందని తెలిసి అభిమానులు సంతోషం వ్యక్తం చేస్తున్నారు. అయితే ఆర్ సి 15 సినిమా పూర్తి అవగానే అంజలి వివాహం చేసుకోబోతుందని సమాచారం. ఏది ఏమైనా మరో ఏడాది తిరగకనే ఆమె పెళ్లి పీటలు ఎక్కబోతోందని చెప్పవచ్చు.

ఇక అంజలి సినిమాల విషయానికి వస్తే.. తెలుగు ఇండస్ట్రీలో స్టార్ హీరోల సరసన నటించే అవకాశం రాకపోయినా ఆ స్టార్ హీరోల సినిమాలలో కీలకపాత్ర పోషించే అవకాశాన్ని దక్కించుకొని పర్వాలేదనిపించుకుంది. అలాగే లేడీ ఓరియంటెడ్ చిత్రాలతో కూడా ప్రేక్షకులను అలరించిన ఈమె తెలుగులో అవకాశాలు రాకపోయేసరికి కోలీవుడ్ కి పరిమితమై అక్కడే పలు సినిమాలు చేస్తూ మెప్పించింది. ఇకపోతే ఇప్పుడు ఆర్.సి 15 సినిమా పాన్ ఇండియా రేంజ్ లో విడుదల కాబోతోంది కాబట్టి ఈ సినిమా హిట్ అయితే అంజలికి పాన్ ఇండియా రేంజ్ లో పాపులారిటీ లభిస్తుందని చెప్పవచ్చు.

Read more RELATED
Recommended to you

Exit mobile version