కేసీఆర్‌ బిగ్‌ ప్లాన్‌.. బీఆర్‌ఎస్‌ జిల్లా సమన్వయకర్తలు వీరే

-

బీఆర్ఎస్ పార్టీ చేపట్టే విస్తృత కార్యక్రమాల అమలు కోసం అన్ని జిల్లాలకు ఇన్చార్జీలను పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్, రాష్ట్ర ఐటీ మున్సిపల్ శాఖ మంత్రి కే.తారక రామారావు సోమవారం ప్రకటించారు. పార్టీ శ్రేణులను ఏకం చేసేలా ఆత్మీయ సమ్మేళనాలు, డాక్టర్ బి.ఆర్.అంబేద్కర్ జయంతి ఉత్సవాలు, పార్టీ ఆవిర్భావ దినోత్సవ కార్యక్రమాలు, నియోజకవర్గ ప్రతినిధుల సభ, బీఆర్ఎస్ విద్యార్థి విభాగం కార్యక్రమాలను రానున్న మూడు,నాలుగు నెలల పాటు విస్తృతంగా చేపట్టాలని పార్టీ నిర్ణయించింది.

ఈ మేరకు ఆదివారం వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ పార్టీ జిల్లా అధ్యక్షులు, పార్టీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శులతో ప్రత్యేకంగా టెలికాన్ఫరెన్స్ నిర్వహించి దిశానిర్దేశం చేశారు. పార్టీ జిల్లా అధ్యక్షులు, స్థానిక ఎమ్మెల్యేలతో జిల్లా ఇన్చార్జీలు వెంటనే సమావేశమై పార్టీ కార్యక్రమాల ప్రణాళిక, అమలుపై చర్చించాలని సూచించారు. పార్టీ చేపట్టే కార్యక్రమాల అమలుపై వారితో ఇన్చార్జీలు నిరంతరం సమన్వయం చేసుకోవాలని, పార్టీ శ్రేణులు సైతం ఈ బృందంతో కలిసి సమన్వయంతో మెలగాలని కేటీఆర్ విజ్ఞప్తి చేశారు.

Read more RELATED
Recommended to you

Exit mobile version