ఎఫ్ 3 సినిమాలో మరో హీరోగా సునీల్..?

-

అనిల్ రావిపూడి దర్శకత్వం వహించిన ఎఫ్ 2 సినిమా ఎంత బ్లాక్ బస్టర్ అయ్యిందో చెప్పాల్సిన పనిలేదు. 2019సంక్రాంతి కానుకగా రిలీజ్ అయిన ఈ సినిమా కాసుల వర్షాన్ని కురిపించింది. వెంకటేష్ కెరీర్లో సూపర్ హిట్ గా నిలిచిన ఈ చిత్రానికి సీక్వెల్ ఉంటుందని అనిల్ రావిపూడి ప్రకటించాడు. లాక్డౌన్ టైమ్ లో స్క్రిప్టు పనులు కూడా జరిగాయి. కానీ ఎఫ్ 2 లో నటించిన వరుణ్ తేజ్, వెంకటేష్.. ఇద్దరూ తమ తమ ప్రాజెక్టులతో బిజీగా ఉండడం వల్ల ఎఫ్ 3 ఇప్పట్లో పట్టాలెక్కే సూచనలు కనబడట్లేదు. అందువల్ల అనిల్ రావిపూడి, మరో కొత్త కథని తెరమీదకి తీసుకొచ్చే ప్రయత్నం చేస్తున్నాడు.

ఐతే అటు కొత్త సినిమా ప్రయత్నాలు చేస్తూనే ఎఫ్ 3 సినిమాలో మరో హీరో కోసం వెతుకుతున్నాడట. తాజా సమాచారం ప్రకారం సునీల్ ని ఎఫ్ 3 లో నటింపజేయాలని అనుకుంటున్నాడట. కమెడియన్ గా ఎంతో పేరు తెచ్చుకున్న సునీల్, హీరోగా మారి విఫలమయ్యాక మళ్లీ కమెడియన్ పాత్రల్లో కనిపిస్తున్నాడు. ఈ నేపథ్యంలో మూడవ హీరోగా సునీల్ అయితే బాగుంటుందని అనుకుంటున్నాడట. ప్రస్తుతానికి అధికారికంగా సమాచారం రానప్పటికీ సునీల్ కన్ఫర్మ్ అనే చెబుతున్నారు.

Read more RELATED
Recommended to you

Latest news