ఫ్లిప్‌కార్ట్‌, అమెజాన్‌ల‌లో సేల్స్ షురూ.. ఫోన్లు, టీవీల‌పై భారీ త‌గ్గింపు ధ‌ర‌లు..

-

ద‌స‌రా పండుగ నేప‌థ్యంలో ఈ-కామ‌ర్స్ సంస్థ‌లు ఫ్లిప్‌కార్ట్‌, అమెజాన్‌లు ప్ర‌త్యేక సేల్‌ల‌ను ప్రారంభించాయి. ఫ్లిప్‌కార్ట్ బిగ్ బిలియ‌న్ డేస్ సేల్ శుక్ర‌వారం ప్రారంభం కాగా అమెజాన్ గ్రేట్ ఇండియ‌న్ ఫెస్టివల్ సేల్ శ‌నివారం ప్రారంభం కానుంది. కానీ అమెజాన్ ప్రైమ్ మెంబ‌ర్ల‌కు సేల్ శుక్ర‌వారం నుంచే అందుబాటులోకి వ‌చ్చింది. ఇక ఈ రెండు సేల్స్ అక్టోబ‌ర్ 21వ తేదీ వ‌ర‌కు కొన‌సాగ‌నున్నాయి. వీటిల్లో అనేక వ‌స్తువుల‌పై భారీ రాయితీలు, ఆఫ‌ర్ల‌ను అందిస్తున్నారు.

flipkart and amazon started special sales

ఫ్లిప్‌కార్ట్ బిగ్ బిలియ‌న్ డేస్ సేల్ ఆఫ‌ర్ల వివ‌రాలు…

ఫ్లిప్‌కార్ట్ బిగ్ బిలియ‌న్ డేస్ సేల్‌లో యాపిల్ ఐఫోన్ ఎస్ఈ 2020, ఐఫోన్ ఎక్స్ఆర్‌, ఐఫోన్ 11 ప్రొ, ఎల్‌జీ జీ8ఎక్స్ థిన్‌క్యూ, శాంసంగ్ గెలాక్సీ నోట్ 10 ప్ల‌స్‌, ఎస్‌20 ప్ల‌స్‌, ఎఫ్41, ఎ70ఎస్‌, ఎ21ఎస్‌, ఎ31, ఎ51, ఎ71, ఐక్యూ 3, రెడ్‌మీ కె20, కె20 ప్రొ, పోకో ఎం2, ఎం2 ప్రొ, ఎక్స్‌2, రియ‌ల్‌మి ఎక్స్‌3, ఎక్స్‌3 సూప‌ర్ జూమ్, రియ‌ల్‌మి 7, సి11, సి12, సి15, 6, ఎక్స్‌50 ప్రొ, మోటోరోలా రేజ‌ర్ 2019, వ‌న్ ఫ్యుష‌న్ ప్ల‌స్‌, మోటో జి9, ఇ7 ప్ల‌స్‌, ఎడ్జ్ ప్ల‌స్‌, నోకియా సి3, 9, ఒప్పో రెనో 2ఎఫ్‌, ఎఫ్‌15, ఎ9 2020, వివో ఎస్‌1 ప్రొ, వి20, వి19, వై50, వై20 ఫోన్ల‌పై త‌గ్గింపు ధ‌ర‌లు, ఎక్స్‌చేంజ్ డిస్కౌంట్లు, ఆఫ‌ర్లను అందిస్తున్నారు.

స్మార్ట్ బ్యాండ్లు, వాచ్‌లు, ప‌వ‌ర్ బ్యాంకులు, సౌండ్ బార్స్‌, బ్లూటూత్ ఇయ‌ర్ ఫోన్స్‌, హోం థియేట‌ర్లు, ల్యాప్‌టాప్‌లు, ట్యాబ్లెట్లు, టీవీల‌పై ఆక‌ర్ష‌ణీయ‌మైన త‌గ్గింపు ధ‌ర‌ల‌ను అందిస్తున్నారు. ఎస్‌బీఐ కార్డుల‌తో 10 శాతం అద‌న‌పు డిస్కౌంట్‌ను పొంద‌వ‌చ్చు.

అమెజాన్ గ్రేట్ ఇండియన్ ఫెస్టివ‌ల్ సేల్ ఆఫ‌ర్ల వివ‌రాలు…

అమెజాన్ గ్రేట్ ఇండియ‌న్ ఫెస్టివ‌ల్ సేల్‌లో.. యాపిల్ ఐఫోన్ 11, శాంసంగ్ గెలాక్సీ ఎస్10 ప్ల‌స్‌, ఎంఐ10, వ‌న్‌ప్ల‌స్ 8, గెలాక్సీ ఎస్‌10, రెడ్‌మీ కె20 ప్రొ, గెలాక్సీ ఎం51, గెలాక్సీ ఎం31ఎస్‌, రెడ్‌మీ నోట్ 9 ప్రొ మ్యాక్స్‌, గెలాక్సీ ఎం31, రెడ్‌మీ నోట్ 9 ప్రొ, నోకియా 5.3, రెడ్‌మీ నోట్ 9, రెడ్‌మీ 9 ఫోన్ల‌పై త‌గ్గింపు ధ‌ర‌ల‌ను అందిస్తున్నారు.

ట్యాబ్లెట్లు, ల్యాప్‌టాప్‌లు, టీవీలు, ప‌వ‌ర్ బ్యాంకులు, హెడ్ ఫోన్స్‌, ఇయ‌ర్ ఫోన్స్‌, వైర్ లెస్ ఇయ‌ర్ బ‌డ్స్‌, ఫైర్‌టీవీ స్టిక్‌, సౌండ్ బార్స్‌, స్టోరేజ్ డివైస్‌లు, మానిట‌ర్లు, యాపిల్ వాచ్ లు, స్మార్ట్ వాచ్‌ల‌పై డిస్కౌంట్ల‌ను పొంద‌వ‌చ్చు. హెచ్‌డీఎఫ్‌సీ కార్డుల‌తో అయితే మ‌రో 10 శాతం అద‌న‌పు డిస్కౌంట్ ఇస్తారు.

Read more RELATED
Recommended to you

Latest news