తెలుగులో విజయవంతంగా దూసుకుపోతున్న ఓటీటీ ఫ్లాట్ ఫామ్ ఆహా నుండి సరికొత్త సిరీస్ వచ్చేస్తుంది. ప్రేక్షకులని ఎంగేజ్ చేయడంలో సూపర్ సక్సెస్ అందుకుంటున్న ఆహా మరో క్రేజీ సిరీస్ తో ముందుకు వస్తుంది. కమెడియన్ ప్రియదర్శి ప్రధాన పాత్రలో వెబ్ సిరీస్ తెరకెక్కింది. కంబాల పల్లి కథలని మెయిల్ పేరుతో వెబ్ సిరీస్ గా తీసుకొస్తున్నారు. ఈ మేరకు ఈ రోజు టీజర్ ని వదిలారు. ఊర్లలోకి కంప్యూటర్లు కొత్తగా పరిచయమైన రోజుల్లో అది నేర్చుకుని మరీ, గేమింగ్ సెంటర్ ని ప్రారంభిస్తాడు.
అతని దగ్గర కంప్యూటర్ నేర్చుకోవడానికి వచ్చిన కొంతమంది అదే ఊరులో మరో కొత్త గేమింగ్ సెంటర్ ఓపెన్ చేస్తారు. అప్పుడు ప్రియదర్శి ఇతరులకు నేర్పించేటపుడు ఏం చేసాడనేది ఆసక్తికరంగా ఉంది. టీజర్ ఆద్యంతం వినోదాత్మకంగా తీర్చిదిద్దారు. స్వప్నా సినిమా బ్యానర్ పై ప్రియాంక దత్ నిర్మిస్తున్న ఈ సిరీస్ ని ఉదయ్ గుర్రాల డైరెక్ట్ చేసారు. ఈ సంక్రాంత్రికి ఆహాలో స్ట్రీమింగ్ అవనుంది.