అంటే సుందరానికి రివ్యూ: నాని తెగ నవ్వించాడు..పబ్లిక్ ఏమన్నారంటే..?

-

సినిమా పేరు: అంటే సుందరానికి
నటీనటులు : నాని, నజ్రియా నజీమ్, హర్షవర్థన్, అజగం పెరుమాల్, నదియా, నిక్కీ తంబోలీ, రోహిణీ తదితరులు
డైరెక్టర్ : వివేక్ ఆత్రేయ
మ్యూజిక్ డైరెక్టర్ : వివేక్ సాగర్
నిర్మాత : వై రవిశంకర్, సీవీ మోహన్
ప్రొడక్షన్ కంపెనీ : మైత్రీ మూవీ మేకర్స్
సినిమాటోగ్రఫీ : నికేత్ బొమ్మి
రిలీజ్ డేట్ : 10 జూన్ 2022

హీరో నాని సినిమాలకు పెద్దగా పరిచయం అక్కర్లేదు.. అతని లాగే సినిమాలు కూడా కూల్ అండ్ సాఫ్ట్ గా ఉంటాయి. ఇటీవల విడుదల అయిన శ్యామ్ సింగరాయ్ సినిమాలొ బెంగాలిని చూపించి మంచి మార్కులు వేయించుకున్నాడు..ఆ సినిమా తర్వాత వెనక్కి తిరిగి చూడకుండా వరుస సినిమాలకు సైన్ చేశాడు. ప్రస్తుతం నాని అంటే సుందరానికి సినిమాలో నటించారు.. నాని సరసన నజ్రియా హీరోయిన్ గా నటించింది.ఆ సినిమా మొత్తం కామెడి, రొమాంటిక్ ఎంటర్ టైనర్ గా ప్రేక్షకుల ముందుకు వచ్చింది..ఈరోజు సినిమా థియేటర్లలోకి వచ్చింది.ఆ సినిమా ఎలా ఉంది..పబ్లిక్ ఏమన్నారో ఇప్పుడు తెలుసుకుందాం..

కథ, విశ్లేషణ..

క్రిస్టియన్ అమ్మాయిని ప్రేమించి కష్టాల్లో పడ్డ బ్రాహ్మణ కుర్రాడు..అతని జీవితం ఎలా సాగుతుంది..చివరికి మజిలీ ఎక్కడికి చేరుతుంది అనేది సినిమా.ఈ సినిమాలో అచ్చ తెలుగు బ్రాహ్మణ కుర్రాడిగా నాని కనిపించాడు. అతడి పేరు సుందర్. యూఎస్ కు వెళ్లి అక్కడ లీలా థామస్(నజ్రియా)ను ప్రేమిస్తాడు. కానీ.. తను క్రిస్టియన్. ఇద్దరి ఫ్యామిలీలలో వాళ్ల ప్రేమను ఒప్పుకోరు. దీంతో వాళ్ల ప్రేమను ఒప్పించడం కోసం సుందర్ ఏం చేశాడు అనేదే సినిమా..నిజానికి ఇలాంటి కథతో తెలుగులో పదుల సంఖ్యలో సినిమాలు వచ్చాయి. కథ పాతదే అయినప్పటికీ దర్శకుడు దానికి ఇచ్చిన ట్రీట్మెంట్ కొత్తగా ఉందన్న మాట వినిపిస్తోంది. ఓ రొటీన్ కథకు దర్శకుడు వివేక్ రాసుకున్న స్క్రీన్ ప్లే, డైలాగ్స్ ప్రేక్షకులకు కొత్త అనుభూతిని పంచుతాయి. ఆ విషయంలో దర్శకుడు సక్సెస్ అయ్యాడని నెటిజెన్స్ అంటున్నారు..

అంటే సుందరానికీ సెకండ్ హాఫ్ బాగుంది అంటున్నారు. క్లైమాక్స్ కూడా బాగా కుదిరింది. సుదీర్ఘ నిడివి కలిగిన కథను బోర్ కొట్టకుండా చెప్పకుండా చెప్పడంలో వివేక్ ఆత్రేయ చాలా వరకు సక్సెస్ అయ్యారు.కామెడీ డైలాగ్స్, ఫ్యామిలీ సన్నివేశాలు, స్క్రీన్ ప్లే బాగున్నాయన్న మాట వినిపిస్తోంది. అలాగే నాని, నజ్రియా మధ్య లవ్ అండ్ రొమాంటిక్ సన్నివేశాలు ఆయన గొప్పగా తీర్చిదిద్దారు. వివేక్ సాగర్ సంగీతం బాగుంది అంటున్నారు. దర్శకుడు రాసుకున్న సన్నివేశాలకు వివేక్ సాగర్ బీజీఎం బలం చేకూర్చింది..ఈ సినిమాలో ఎవరికీ వారే అన్నట్లు పోటీ పడి మరీ నటించారు..సినిమా కథని కొద్దిగా సాగదీయడం సినిమాకు మైనస్ అయ్యింది. ఓవర్ ఆల్ గా సినిమా నవ్వులు పూయించింది.ఇప్పటి వరకూ మంచి టాక్ ను అందుకుంది..కలెక్షన్స్ ఎలా ఉన్నాయో సాయంత్రం చూడాలి..

రేటింగ్:3/5

Read more RELATED
Recommended to you

Exit mobile version