ప్రపంచవ్యాప్తంగా కరోనా వైరస్ విజృంభిస్తున్న నేపథ్యంలో మానవాళి భయాందోళనకు గురవుతోంది. కరోనాకు విరుగుడు కనిపెట్టక పోవడంతో రోజురోజుకూ దాని ప్రభావం పెరుగుతూనే ఉంది. ప్రపంచవ్యాప్తంగా లక్షల మందికి కరోనా సోకగా.. వేల మంది ప్రాణాలను కబళించింది. ఇంతలా మానవాళిని బయపెడుతున్న కరోనా నియంత్రణకు మన ప్రభుత్వాలు ఎన్ని చర్యలు తీసుకున్నా ఏ మాత్రం ప్రయోజనం లేకుండా పోతోంది.
కరోనా కట్టడిలో భాగంగా దేశ ప్రధాని నరేంద్ర మోడీ.. 21 రోజుల పాటు లాక్ డౌన్ ప్రకటించిన సంగతి తెలిసిందే. ఇంట్లోనే ఉండండి.. సురక్షితంగా ఉండండి.. శుభ్రంగా ఉండండి.. చేతులు కడుక్కోండి మాస్కులు ధరించండని నిత్యం ప్రకటనలు చేస్తూ ఉన్నారు. ధరించిన మాస్కులు రోడ్లపై పడేయకండి, వాటి వల్ల కూడా వైరస్ వ్యాప్తి చెందుతుందని ఎంత చెప్పినా ఎవ్వరూ వినడం లేదు.
ఎక్కడ పడితే అక్కడే మాస్కులు పారేయడంతో అనుపమా పరమేశ్వరణ్ ఫైర్ అయింది. రోడ్డుపై మాస్కులు పడి ఉన్న ఫోటోలను షేర్ చేస్తూ.. ఇదేనా కరోనాతో పోరాడే పద్దతి అంటూ ఆగ్రహం వ్యక్తం చేసింది. ఈ ఫోటోలు ఎంతో బాగున్నాయ్ కదా.. ఈ మాస్క్‌లన్నీ 500మీటర్ల దూరంలోనే ఉన్నాయి.. ఇలా మాత్రం చేయకండి.. డస్ట్ బిన్‌లోనే పడేయండి.. దయ చేసి మళ్లీ వాడకండి.. వాటిని ముట్టుకోకండి.. అంటూ సూచనలు ఇచ్చింది.