ఆ ఫోటోపై అనుష్క ఏమన్నదంటే..

-

నిశ్శబ్దం సినిమా అమెజాన్ ప్రైమ్ లో విడుదలైన సంగతి తెలిసిందే. అనుష్క శెట్టి ప్రధాన పాత్రలొ తెరకెక్కిన ఈ చిత్రానికి ప్రేక్షకుల నుండి సరైన స్పందన రాలేదు. థియేటర్లు తెరుచుకోని కారణంగా అనుష్క నటించిన నిశ్శబ్దం డైరెక్టుగా ఓటీటీలో రిలీజైంది. ఐతే సినిమా ప్రమోషన్లలో భాగంగా అనుష్క శెట్టి అభిమానులతో ముచ్చటించింది. ట్విట్టర్ ద్వారా అభిమానులతో మాట్లాడిన అనుష్క, వారి ప్రశ్నలని జవాబులు ఇస్తూ వచ్చింది.

ఈ నేపథ్యంలో ఒకానొక నెటిజన్, ప్రభాస్, అనుష్క పెళ్ళి పీటల మీద కూర్చున్న ఫోటో పై కామెంట్ చేయమని పెట్టాడు. దానికి అనుష్క స్పందిస్తూ, మిర్చి సినిమా పోస్టర్ డిజైన్ కోసం ఆ ఫోటో దిగామని, ఆ సినిమా తనకి చాలా ఇష్టమని తెలిపింది. ఇంకా సినిమా నిర్మాతలైన వంశీ, ప్రమోద్ లకి ధన్యవాదాలు తెలిపింది.

నిశ్శబ్దం సినిమాని కోన ఫిలిమ్ కార్పోరేషన్ బ్యానర్, పీపుల్ మీడియా ఫ్యాక్టరీ సంయుక్తంగా నిర్మించగా హేమంత్ మధుకర్ దర్శకత్వంలో తెరకెక్కింది. అనుష్క ప్రధాన పాత్రలో నటించగా, ఆర్ మాధవన్, అంజలి కీలక పాత్రల్లో నటించారు.

Read more RELATED
Recommended to you

Exit mobile version