టాలీవుడ్ స్టార్ హీరోయిన్ అనుష్క శెట్టి గురించి ప్రత్యేకంగా పరిచయం అవసరం లేదు. ఈ చిన్నది అనేక సినిమాలలో నటించి తనకంటూ ప్రత్యేకమైన గుర్తింపును సొంతం చేసుకుంది. ఎంతోమంది స్టార్ హీరోల సినిమాలలోనూ హీరోయిన్ గా చేసి తన సత్తాను చాటుకున్న ఈ చిన్నది వయసు పెరిగినప్పటికీ ఇంతవరకు వివాహం చేసుకోకుండా సింగిల్ గానే తన లైఫ్ కొనసాగిస్తోంది. తాజాగా ఈ చిన్నది తనకు సంబంధించిన ఓ విషయాన్ని అభిమానులతో షేర్ చేసుకుంది. తాను ఆరో తరగతి లోనే తన స్నేహితుడితో ప్రేమలో పడినట్లుగా అనుష్క శెట్టి పేర్కొన్నారు.

తన ఫస్ట్ లవ్ విషయాన్ని అభిమానులతో షేర్ చేసుకుంటూ అందరికీ షాక్ ఇచ్చారు. ఓ రోజు నా క్లాస్ నా దగ్గరికి వచ్చి ఐ లవ్ యు చెప్పాడు. నేను కూడా అతనికి ఓకే చెప్పాను ఆ సమయంలో ఐ లవ్ యు అంటే ఏమిటో కూడా తెలియదు. ఆ విషయం ఇప్పటికే గుర్తు చేసుకుంటే నాకు ఎంతో సంతోషంగా అనిపిస్తుంటుంది అంటూ అనుష్క తనకు సంబంధించిన విషయాన్ని షేర్ చేసుకున్నారు. ఈ విషయం హాట్ టాపిక్ గా మారింది. ఇదిలా ఉండగా ప్రస్తుతం ఈ చిన్నది ఘాటీ సినిమాలో నటించింది. ఈ సినిమా తొందర్లోనే విడుదలకు సిద్ధంగా ఉంది.