ఏపీ ఉద్యోగులకు శుభవార్త అందజేసింది కూటమి ప్రభుత్వం. గ్రామ పంచాయతీ మల్టీపర్పస్ వర్కర్లకు మూడు నెలల జీతాలను రిలీజ్ చేసింది. దీని కింద రూ. 150 కోట్లు ఆర్థిక శాఖ విడుదల చేసింది. మరోవైపు రేషన్ బియ్యం, అక్రమ రవాణా దారులపై కఠిన చర్యలు తీసుకోవాలని నిర్ణయం తీసుకున్నారు. 6ఏతో పాటు పీడీ కేసులు నమోదు చేయాలని మంత్రి నాదెండ్ల మనోహర్ కీలక వ్యాఖ్యలు చేశారు.

అంతేకాకుండా రైతుల ధాన్యం బకాయిల కోసం రూ. 672 కోట్లు విడుదల చేయడానికి కేబినెట్ ఆమోదం తెలియజేసింది. ఇదిలా ఉండగా… ఏపీ రాష్ట్రంలో మరోవైపు భారీగా వర్షాలు కురుస్తున్నాయి. నిన్నటి నుంచి మరో రెండు రోజుల పాటు భారీ నుంచి అతి భారీ వర్షాలు కురిసే అవకాశాలు ఉన్నాయని వాతావరణ శాఖ అధికారులు సూచనలు జారీ చేశారు. వర్షాలతో పాటు ఈదురు గాలులు వీచే అవకాశం ఉందని ఐఎండి సంస్థ తెలియజేసింది.