Telangana GPO recruitment: గ్రామ పాలన అధికారుల భర్తీకి రెండో విడత నోటిఫికేషన్ రిలీజ్ అయింది. 10,954 పోస్టుల భర్తీకి మార్చి 29న మొదటి నోటిఫికేషన్ రిలీజ్ కాగా, 3,550 మంది ఎంపిక అయ్యారు. మిగతా ఖాళీల్లోనూ గతంలో విఆర్ఏ, వీఆర్వోలుగా చేసిన వారికి అవకాశం ఇవ్వబోతున్నారు. ఈ నెల 16 లోపు కలెక్టర్ కార్యాలయంలో దరఖాస్తు చేసుకునేందుకు అవకాశం ఇచ్చారు.

ఈ నెల 27వ తేదీన GPO పరీక్ష నిర్వహించేందుకు సిద్ధమయ్యారు అధికారులు. ఇదిలా ఉండగా… తెలంగాణ రాష్ట్రంలో కొత్తగా 422 బస్సులను ప్రవేశపెట్టేందుకు సిద్ధమైంది ఆర్టీసీ సంస్థ. మహాలక్ష్మి పథకంతో స్త్రీలకు ఉచిత బస్సు సదుపాయాన్ని కల్పించింది రేవంత్ రెడ్డి ప్రభుత్వం. దీంతో మహిళలు సంతోషం వ్యక్తం చేస్తున్నారు. ఎలాంటి చార్జీలు లేకుండా వారి గమ్యస్థానాలకు చేరుకుంటున్నారు.