Armor BJP MLA Paidi Rakesh Reddy comments on Pushpa 2: ఆర్మూర్ బీజేపీ ఎమ్మెల్యే పైడి రాకేష్ రెడ్డి హాట్ కామెంట్స్ చేశారు. పుష్ప-2 సినిమాను రిలీజ్ చేయొద్దు అంటూ బాంబు పేల్చారు ఆర్మూర్ బీజేపీ ఎమ్మెల్యే పైడి రాకేష్ రెడ్డి. పుష్ప సినిమాలో చూపించింది అంతా అబద్ధం.. ఎర్రచందనం రూ.10 లక్షలుంటే రూ.కోటిలాగా చూపించారన్నారు.
దీంతో యువకులు లక్షలాది చెట్లను నరికేశారు.. ఇప్పుడు పుష్ప-2తో ఇంకెన్ని చెట్లు నరికేస్తారో? అని నిలదీశారు ఆర్మూర్ బీజేపీ ఎమ్మెల్యే పైడి రాకేష్ రెడ్డి. ఆ సినిమాతో యువత పాడవుతోంది. అల్లు అర్జున్, సుకుమార్లను అరెస్టు చేసి, జైల్లో వేయాలి.. ఆ మూవీని రిలీజ్ చేయొద్దు అని డిమాండ్ చేశారు ఆర్మూర్ బీజేపీ ఎమ్మెల్యే పైడి రాకేష్ రెడ్డి.