ఏపీ సీఎం చంద్రబాబు ఆస్తులపై ఆర్మూర్ బీజేపీ ఎమ్మెల్యే పైడి రాకేష్ రెడ్డి సంచలన వ్యాఖ్యలు చేశారు. చంద్రబాబు వాళ్ళ అయ్యకు 2 ఎకరాల ఆస్తి ఉండేదన్నారు.. ఇప్పుడు ఆయనకు వేలాది ఎకరాల హెరిటేజ్ ఎక్కడి నుండి వచ్చిందని ప్రశ్నించారు ఆర్మూర్ బీజేపీ ఎమ్మెల్యే పైడి రాకేష్ రెడ్డి.
ఇది ఎవరూ ఎందుకు అడగరు అని పేర్కొన్నారు ఆర్మూర్ బీజేపీ ఎమ్మెల్యే పైడి రాకేష్ రెడ్డి. అటు పుష్ప-2 సినిమాను రిలీజ్ చేయొద్దు అంటూ బాంబు పేల్చారు ఆర్మూర్ బీజేపీ ఎమ్మెల్యే పైడి రాకేష్ రెడ్డి. పుష్ప సినిమాలో చూపించింది అంతా అబద్ధం.. ఎర్రచందనం రూ.10 లక్షలుంటే రూ.కోటిలాగా చూపించారన్నారు.
దీంతో యువకులు లక్షలాది చెట్లను నరికేశారు.. ఇప్పుడు పుష్ప-2తో ఇంకెన్ని చెట్లు నరికేస్తారో? అని నిలదీశారు ఆర్మూర్ బీజేపీ ఎమ్మెల్యే పైడి రాకేష్ రెడ్డి. ఆ సినిమాతో యువత పాడవుతోంది. అల్లు అర్జున్, సుకుమార్లను అరెస్టు చేసి, జైల్లో వేయాలి.. ఆ మూవీని రిలీజ్ చేయొద్దు అని డిమాండ్ చేశారు ఆర్మూర్ బీజేపీ ఎమ్మెల్యే పైడి రాకేష్ రెడ్డి.