తెలంగాణ ఆర్టీసీపీ విమర్శలు.. ప్రయాణికుల గుర్రు

-

తెలంగాణ ఆర్టీసీపై విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. ఇక ప్రయాణికులైతే నారాజ్‌గా ఉన్నారు.ఎలక్ట్రిక్ బస్సుల పేర్లు చెప్పి అదనపు చార్జీలు వసూలు చేస్తుండటంపై ప్రయాణికులు తీవ్ర అసంతృప్తితో ఉన్నారు.గ్రీన్ ట్యాక్స్ పేరిట అదనంగా రూ.20 వసూలు చేస్తున్నట్లు సమాచారం.టికెట్టు పైన కనిపించే చార్జీ ఒకటి,ప్రయాణికుల వద్ద వసూలు చేసే చార్జీ మరొకటిగా ఉంది.

హనుమకొండ నుండి ఉప్పల్ వరకు ఎలక్ట్రిక్ బస్సులో సామాన్యంగా టికెట్టు చార్జీ రూ.260 కాగా, ప్రయాణికుల వద్ద రూ.280 వసూలు చేస్తున్నట్లు ఆరోపణలు వస్తున్నాయి.డీలక్స్ బస్సు చార్జీ రూ.260 కాగా రూ.280,ఎక్స్‌ప్రెస్ బస్ చార్జీ
రూ.200 కాగా రూ.210, సూపర్ లగ్జరీ చార్జీ రూ.300కు బదులు రూ.320 వసూలు చేస్తున్నట్లు తెలిసింది.
ఈ విషయంపై వివరణ కోరగా..ఎలక్ట్రిక్ బస్సుల్లో టికెట్ పై గ్రీన్ ట్యాక్స్ అదనంగా పడుతుందని..ఇది రాష్ట్రవ్యాప్తంగా అమలవుతుందని ఆర్టీసీ సిబ్బంది చెప్పడం గమనార్హం.

Read more RELATED
Recommended to you

Exit mobile version