టాలీవుడ్ కుర్ర హీరో నాగ శౌర్య నటించిన అశ్వద్ధామ ఇటీవల రిలీజ్ అయింది. మొట్టమొదటిసారి సొంతంగా స్టోరీ రాసుకొని నాగశౌర్య నటించిన ఈ సినిమా భారీ అంచనాల మధ్యన విడుదల అయ్యింది. ఒక మాస్ తరహా స్టోరీలో నాగశౌర్య నటించిన ఈ సినిమాకి ప్లాప్ మిక్సిడ్ టాక్ రావడం జరిగింది. అయితే టాక్ ఎలా ఉన్నా గాని ప్రస్తుతం ఈ సినిమాకి కలెక్షన్లు ఓ రేంజ్ లో వస్తున్నాయి.
ఇప్పటిదాకా ఈ సినిమాకి సంబంధించి వచ్చిన కలెక్షన్లు బట్టి నాగశౌర్య కెరీర్లోనే బెస్ట్ ఓపెనింగ్స్ ను అశ్వద్ధామ దక్కించుకున్నట్లు లెక్కలు చెబుతున్నాయి. అయితే దీనంతటికీ కారణం ప్లస్ పాయింట్ సినిమాకి సంబంధించిన పబ్లిసిటీ అని హోమ్ బ్యానర్ కావడంతో పైగా నాగశౌర్య తాను రాసుకున్న స్టొరీపై బలమైన నమ్మకం ఉండటంతో సినిమా తెరకెక్కించడంలో మరియు ప్రమోషన్ విషయంలో చాలా అద్భుతంగా సినిమా యూనిట్ కష్టపడటం జరిగింది.
ఇందువలన అశ్వధామ సినిమా కి ప్లాప్ తరహాలో మిక్సిడ్ టాక్ వచ్చినా కలెక్షన్ లో మాత్రం తగ్గటం లేదని ట్రేడ్ వర్గాలు చెబుతున్నాయి. సినిమా విడుదలకు ముందు సోషల్ మీడియా.. వెబ్ మీడియా.. ఎలాక్ట్రానిక్ మీడియా.. ప్రింట్ మీడియా ఇలా అన్ని మీడియాల్లో కూడా అశ్వథ్థామ గురించి ఫుల్ గా పబ్లిసిటీ చేయడం జరిగింది. అందుకే ఈ చిత్రం మొదటి రోజు 3.6 కోట్ల గ్రాస్ ను వసూళ్లు చేసినట్లుగా తెలుస్తుంది. ఓవర్సీస్ తో పాటు తెలుగు రాష్ట్రాల్లో ఈ వీకెండ్ కూడా మంచి వసూళ్లను రాబట్టే అవకాశం ఉన్నట్లు సమాచారం.