గజినీ సినిమాతో మంచి పేరు సొంతం చేసుకొని తెలుగు, తమిళ్ సినిమాలతో మరింత పాపులారిటీ దక్కించుకున్న హీరోయిన్ అసిన్ గురించి ప్రత్యేకంగా పరిచయం అవసరం లేదు. తెలుగులో అమ్మానాన్న ఓ తమిళమ్మాయి, లక్ష్మీనరసింహ, శివమణి లాంటి సూపర్ హిట్ చిత్రాలలో నటించి మెప్పించిన ఈమె కెరియర్ జోరు మీద ఉన్నప్పుడే 2016లో మైక్రోమ్యాక్స్ వ్యవస్థాపకుడు రాహుల్ శర్మను వివాహం చేసుకొని సెటిల్ అయ్యింది. ఇక తర్వాత సినిమాలకు పూర్తిగా గుడ్ బై చెప్పేసిందని తెలిసిందే.
ఇకపోతే అసిన్ , రాహుల్ శర్మ దంపతులకు ఒక కుమార్తె జన్మించగా ప్రస్తుతం ఆమెతో హ్యాపీగా తమ జీవితాన్ని లీడ్ చేస్తోంది. ఇకపోతే ఇప్పుడు ఈమె వ్యక్తిగత జీవితంలో రూమర్లు బాగా వైరల్ అవుతున్నాయి. ఆసిన్ రాహుల్ శర్మతో విడిపోతోందని.. విడాకులకు కూడా సిద్ధం అయిందని కొన్ని ఊహించని షాకింగ్ వార్తలు రూమర్స్ గా మొదలయ్యాయి. ముఖ్యంగా రాహుల్ శర్మ ఇంకొక అమ్మాయితో యవ్వారం నడుపుతున్నాడని. దీనిపై ఆమె ఎన్నిసార్లు ఖండించిన అతడు మాత్రం లెక్క చేయలేదని అందుకే విసుగిపోయిన ఆసిన్ రాహుల్ శర్మ నుంచి విడాకులు తీసుకోబోతోంది అంటూ వార్తలు సృష్టించారు. ఇక ఈ విషయాలు కాస్త సోషల్ మీడియాలో వైరల్ అవ్వడంతో తన వరకు చేరిన వార్తలపై ఖండిస్తూ కామెంట్లు చేసింది
ఇక తాజాగా అసిన్ సోషల్ మీడియాలో ఒక పోస్ట్ పెట్టి తన విడాకుల రూమర్స్ పై క్లారిటీ ఇచ్చింది. తాను విడాకులు తీసుకుంటున్నట్లు వస్తున్న వార్తలు పూర్తిగా అసత్యం అని ఖండించింది. ప్రస్తుతం నేను నా భర్త సమ్మర్ వెకేషన్ మధ్యలో ఉన్నాము. ఇద్దరం పక్కపక్కనే కూర్చుని బ్రేక్ఫాస్ట్ చేస్తూ ఎంజాయ్ చేస్తున్నాము. ఇంతలో పూర్తిగా ఊహ జనితమైన బేస్లెస్ న్యూస్ వచ్చింది ఈ వార్త విన్నాక మా పెళ్లి రోజులు గుర్తుకు వచ్చాయి.. మా పెళ్ళికి ముందే మాపై ఇటువంటి రూమర్స్ వచ్చాయి కానీ ఇప్పుడు ఏకంగా విడిపోతున్నట్టు సృష్టించడం చాలా బాధాకరంగా ఉంది. నా జీవితంలో ఐదు నిమిషాలు వృధా అయినట్లు అనిపిస్తోంది లేదంటే ఈ హాలిడే ని ఇంకా బాగా ఎంజాయ్ చేసేదాన్ని అంటూ ఆమె చెప్పుకొచ్చింది.