దిల్ రాజు పై జనసేన బహిష్కృత నేత అత్తి సత్యనారాయణ షాకింగ్ కామెంట్స్ చేసాడు. దిల్ రాజు అతని తమ్ముడిని కాపాడుకోవడానికి నాపై నిందలు వేశారని ఫైర్ అయ్యారు. జనసేన పార్టీ నుండి బహిష్కరణకు గురైన అత్తి సత్యనారాయణ ఇవాళ మీడియా ముందు సంచలన వ్యాఖ్యలు చేశారు.

ఇటీవల జూన్ 1వ తేదీన థియేటర్ల బంద్ అని ప్రకటన రావడానికి ప్రధాన కారణమని అత్తి సత్యనారాయణను పార్టీ నుండి సస్పెండ్ చేసింది జనసేన పార్టీ. థియేటర్ల బంద్ అని నేను ఎక్కడా ప్రస్తావించలేదని పేర్కొన్నారు. థియేటర్ల బంద్ అని ప్రకటించిందే దిల్ రాజు తమ్ముడు శిరీష్ రెడ్డి, అతని తమ్ముడిని కాపాడుకోవడానికి నాపై నిందలు వేశారన్నారు. దిల్ రాజు కమల్ హసన్ ని మించిపోయేలా నటించి, పవన్ కళ్యాణ్ సీరియస్ అవ్వగానే జనసేన పార్టీ పేరు ఉద్దేశపూర్వకంగానే తెరపైకి తెచ్చాడని వెల్లడించారు జనసేన బహిష్కృత నేత అత్తి సత్యనారాయణ.