దేశంలోని రైతులకు అదిరిపోయే శుభవార్త చెప్పింది మోడీ ప్రభుత్వం. దేశవ్యాప్తంగా ఖరీఫ్ పంటల మద్దతు ధరను తాజాగా పెంచడం జరిగింది. ఖరీఫ్ పంటల మద్దతు ధర పెంచుతూ తాజాగా కేంద్ర కేబినెట్ కూడా నిర్ణయం తీసుకుంది. రైతుల పెట్టుబడి పై 50% లాభం ఉండేలా ధరలు పెంచడం జరిగింది.

క్వింటా వరి ధాన్యం 69 రూపాయలు పెంచింది. దీంతో వరి ధాన్యం క్వింటాల్ RS. 2369 రూపాయలకు పెరిగింది. అదే సమయంలో మద్దతు ధర పెంపు కోసం 2.70 లక్షల కోట్లు కేటాయించినట్లు కేంద్రమంత్రి అశ్విని వైష్ణవి ప్రకటన చేశారు. బద్వేల్ నుంచి నెల్లూరు మధ్య అలాగే వార్ధా నుంచి బల్లర్ష మధ్య రహదారికి గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది మోడీ సర్కార్.