ఏపీకి కేంద్రం మరో గుడ్ న్యూస్.. బద్వేల్‌-నెల్లూరు 4 లేన్ల హైవేకు గ్రీన్ సిగ్నల్

-

ఏపీ వాసులకు అదిరిపోయే శుభవార్త చెప్పింది మోడీ ప్రభుత్వం. బద్వేల్ నుంచి నెల్లూరు మధ్య అలాగే వార్ధా నుంచి బల్లర్ష మధ్య రహదారికి గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది మోడీ సర్కార్. అటు దేశవ్యాప్తంగా ఖరీఫ్ పంటల మద్దతు ధరను తాజాగా పెంచడం జరిగింది. ఖరీఫ్ పంటల మద్దతు ధర పెంచుతూ తాజాగా కేంద్ర కేబినెట్ కూడా నిర్ణయం తీసుకుంది.

Green signal for Badvel-Nellore 4-lane highway
Green signal for Badvel-Nellore 4-lane highway

రైతుల పెట్టుబడి పై 50% లాభం ఉండేలా ధరలు పెంచడం జరిగింది. క్వింటాల్ వరి ధాన్యం 69 రూపాయలు పెంచింది. దీంతో వరి ధాన్యం క్వింటాల్ RS. 2369 రూపాయలకు పెరిగింది. అదే సమయంలో మద్దతు ధర పెంపు కోసం 2.70 లక్షల కోట్లు కేటాయించినట్లు కేంద్రమంత్రి అశ్విని వైష్ణవి ప్రకటన చేశారు.

 

  • కేంద్ర కేబినెట్ కీలక నిర్ణయాలు
  • ఖరీఫ్‌ పంటలకు కనీస మద్దతు ధర పెంపు
  • ఖరీఫ్‌ పంటకు మద్దతు ధర కోసం రూ.2 లక్షల 70వేల కోట్లు కేటాయింపు
  • రైతు సంక్షేమం కోసం ఇంట్రెస్ట్‌ సబ్వేషన్స్‌ స్కీమ్
  • వార్డా-బల్లార్షా లేన్ల రహదారి నిర్మాణానికి ఆమోదం
  • రత్లాం-నాగ్డా 4 లేన్ల రహదారి నిర్మాణానికి కేంద్ర కేబినెట్ ఆమోదం
  • బద్వేల్‌-నెల్లూరు 4 లేన్ల హైవేకు కేబినెట్‌ ఆమోదం
  • కేబినెట్ నిర్ణయాలను వెల్లడించిన కేంద్ర మంత్రి అశ్విని వైష్ణవ్

Read more RELATED
Recommended to you

Latest news