అరుదైన రికార్డు సృష్టించిన అవతార్ 2..!

-

ప్రముఖ హాలీవుడ్ డైరెక్టర్ జేమ్స్ కామెరున్ దర్శకత్వంలో తెరకెక్కిన విజువల్ అండర్ మూవీ అవతార్ ది వే ఆఫ్ వాటర్.. డిసెంబర్ 16వ తేదీన ప్రపంచవ్యాప్తంగా 180 కి పైగా భాషలలో విడుదలైన ఈ సినిమా ప్రేక్షకుల ముందుకు వచ్చి వసూళ్ల వర్షాన్ని కురిపిస్తూ అరుదైన రికార్డును సొంతం చేసుకుంది ఈ సినిమా. ఈ చిత్రం 14 రోజుల్లోనే రూ. 8200 కోట్ల మార్కును అధిగమించింది. అంతేకాదు 12 రోజుల్లోనే 1 బిలియన్ డాలర్ మార్కును సాధించడం గమనార్హం. ఫలితంగా ఈ ఏడాది వేగంగా ఈ ఘనత సాధించిన చిత్రంగా అవతార్ 2 చిత్రం రికార్డు సృష్టించింది.

2022లో ఇప్పటివరకు మూడు సినిమాలు మాత్రమే బిలియన్ డాలర్ మైలురాయిని అందుకున్నాయి. అందులో టామ్ క్రూజ్ నటించిన టాప్ గన్ మ్యావ్రిక్ సినిమా విడుదలయి 31 రోజుల్లో ఈ రికార్డు సాధిస్తే.. క్రిష్ ప్రాక్ నటించిన జురాసిక్ డొమినియన్ సినిమా విడుదలయి నాలుగు నెలలకు ఈ ఘనత సాధించింది. కానీ అవతార్ 2 విడుదలైన 12 రోజుల్లోనే ఈ రికార్డును కైవసం చేసుకోవడం నిజంగా అదొక అద్భుతమైన రికార్డు అని చెప్పవచ్చు. ఇకపోతే 2019లో ప్రపంచవ్యాప్తంగా తొమ్మిది సినిమాలు మాత్రమే వన్ బిలియన్ డాలర్ మార్కును అందుకున్నాయి.

అయితే ఇప్పుడు అత్యంత వేగంగా వన్ బిలియన్ డాలర్ మార్క్ ను అందుకున్న చిత్రంగా అవతార్ 2 రికార్డ్ సృష్టించింది. ప్రపంచవ్యాప్తంగా అత్యధిక వసూళ్లు సాధించిన చిత్రం జేమ్స్ కామెరున్ అవతార్ మొదటి భాగం 2.97 బిలియన్ డాలర్లతో మొదటి స్థానంలో ఉంది. అయితే ఈ ఏడాది అవతార్ -2 అత్యధిక వసూళ్లు సాధించిన చిత్రంగా రెండవ స్థానాన్ని కైవసం చేసుకుంది.

Read more RELATED
Recommended to you

Latest news

Exit mobile version