‘అవతార్’ మూవీ వరల్డ్ సినిమా హిస్టరీ ఓ సెన్సేషన్. పార్ట్-1నే ప్రేక్షకులు మరిచిపోలేదంటే ఇటీవల రిలీజ్ అయిన పార్ట్-2కు మరింత ఫిదా అయ్యారు. హాలీవుడ్ దర్శకుడు జేమ్స్ కామెరూన్ అవతార్ మొదటి పార్ట్లో పండోర అనే కల్పిత గ్రహాన్ని సృష్టించి అందులోని ప్రకృతి అందాలను కళ్లుచెదిరే విజువల్ ఎఫెక్ట్స్‌తో అందరినీ మెస్మరైజ్ చేశాడు. ఆ తర్వాత ‘అవతార్: ది వే ఆఫ్ వాటర్’తో మరో విజువల్ ట్రీట్ ఇచ్చి వండర్ క్రియేట్ చేశాడు. ఈ సినిమా ప్రపంచవ్యాప్తంగా దాదాపు160 భాషల్లో విడుదలైన ఆ సీక్వెల్ బాక్సాఫీసు కలెక్షన్ల సునామీ సృష్టించింది.
ఇక అవతార్ ఫ్రాంచైజీలో మరో సినిమా అవతార్-3కి కామెరూన్ రంగం సిద్ధం చేస్తున్నారు. ఇటీవల ఓ ఇంటర్వ్యూలో పాల్గొన్న ఆయన ఈ సినిమాను 2025 డిసెంబరు 19వ తేదీన విడుదల చేస్తానని చెప్పారు. అందుకోసం ప్రేక్షకులను మెస్మరైజ్ చేసే విధంగా టీజర్ రిలీజ్కు రెడీ అవుతున్నట్లు వెల్లడించారు. ఎవరూ ఊహించని లైవ్-యాక్షన్‌ని ఇందులో చూస్తారని చెప్పారు. సముద్రం అడుగున ఉండే అద్భుతమైన విజువల్స్‌ని చూపిస్తామని తెలిపారు. అవతార్ ఫ్రాంచైజీలో రానున్న ‘అవతార్ 4’ 2029లో, చివరిగా రానున్న ‘అవతార్ 5’ డిసెంబరు 2031లో విడుదల చేయనున్నట్లు చిత్రబృందం తెలిపింది.