ఓటీటీలోకి అయాలాన్ మూవీ.. స్ట్రీమింగ్ ఎప్పుడంటే?

-

తమిళ్ హీరో శివ కార్తికేయన్‌ కు తెలుగులోనూ మార్కెట్ ఉంది. తను నటించిన రెమో, డాన్, డాక్టర్, మహావీరుడు, ప్రిన్స్ సినిమాలు టాలీవుడ్ లోనూ హిట్ అయ్యాయి. ఇక శివ కార్తికేయన్ నటనకు తెలుగు ప్రేక్షకులు ఫిదా అయ్యారు. అందుకే తన సినిమాలను తమిళ్ తో పాటు తెలుగులోనూ డబ్ చేసి విడుదల చేస్తూ ఉంటారు.

ఇక శివ కార్తికేయన్ లేటెస్ట్ గా ప్రధాన పాత్రలో నటించిన సైన్స్‌ ఫిక్షన్‌ మూవీ ‘అయలాన్‌’ . రకుల్‌ ప్రీత్‌ హీరోయిన్ గా నటించిన ఈ సినిమాను రవికుమార్‌ తెరకెక్కించారు. సంక్రాంతి కానుకగా తమిళంలో విడుదలైన ఈ సినిమా అక్కడ సూపర్ హిట్ టాక్ తెచ్చుకుంది.  ఇప్పుడీ చిత్రం ఓటీటీలో విడుదలకు రెడీ అవుతోంది. ప్రముఖ ఓటీటీ సంస్థ సన్‌ నెక్స్ట్‌ వేదికగా ఫిబ్రవరి 9వ తేదీ నుంచి ఈ మూవీ తమిళ, తెలుగు భాషల్లో స్ట్రీమింగ్‌ కానుంది. ఈ విషయాన్ని సదరు ఓటీటీ సంస్థ ఎక్స్‌ (ట్విటర్‌)లో పోస్ట్‌ పెట్టింది.

Read more RELATED
Recommended to you

Latest news