‘బేబీ’ నా మజాకా.. 8 రోజుల్లోనే రూ.50 కోట్ల వసూళ్లు

-

బేబీ సినిమా రిలీజ్ అయి దాదాపుగా పది రోజులు కావొస్తోంది. అయినా అన్ని థియేటర్లలో హౌజ్ ఫుల్ బోర్డే కనిపిస్తోంది. సినిమా గురించి మంచి టాక్ బయటకు రావడంతో అంతా ఈ సినిమాకే పచ్చజెండా ఊపుతున్నారు. ముఖ్యంగా నెట్టింట మీమ్స్ చూసిన యువత ఈ చిత్రాన్ని చూసేందుకు క్యూ కడుతోంది. చిన్న సినిమాగా విడుదలైన ఈ చిత్రం నెమ్మదిగా వసూళ్ల వర్షం కురిపిస్తోంది. తాజాగా ఈ మూవీ రూ.50 కోట్ల క్లబ్‌లో చేరిపోయింది. కేవలం 8 రోజుల్లోనే ఈ ఫీట్‌ను అందుకుందంటే మామూలు విషయం కాదు. శని, ఆదివారాల్లో కూడా ఈ సినిమా బుకింగ్స్‌ అద్భుతంగా ఉన్నాయి.

వచ్చే వారం బ్రో సినిమా రిలీజ్ అయ్యే వరకు బేబీ మూవీకి పోటీ లేదు. ఈ లెక్కన ఫైనల్‌ రన్‌లో మరో రూ.25 కోట్లు ఈజీగా వెనకేసుకోవచ్చని సినీ వర్గాల్లో టాక్. ఈ సినిమా కొన్న డిస్ట్రిబ్యూటర్‌లు ఇప్పటికే లాభాల్లోకి వచ్చేశారు. సాయి రాజేష్ దర్శకత్వం వహించిన ఈ సినిమాలో ఆనంద్‌ దేవరకొండ, వైష్ణవి చైతన్య, విరాజ్‌ ప్రధానపాత్రల్లో నటించారు.

Read more RELATED
Recommended to you

Latest news