Bail for Kaushik Reddy: బీఆర్ఎస్ పార్టీ హుజురాబాద్ ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డికి బిగ్ రిలీఫ్ దక్కింది. బీఆర్‌ఎస్ పార్టీ హుజురాబాద్ ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డికి బెయిల్ మంజూరు అయింది. ఈ మేరకు కోర్టు తీర్పు ఇచ్చింది. నిన్న బీఆర్‌ఎస్ పార్టీ హుజురాబాద్ ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డిని అరెస్ట్ చేసి.. ఇవాళ కరీంనగర్ కోర్టులో హాజరుపరిచారు పోలీసులు.
అయితే.. బీఆర్‌ఎస్ పార్టీ లాయర్లు గట్టిగా వాదించడంతో…. హుజురాబాద్ ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డికి బెయిల్ మంజూరు అయింది. కౌశిక్ రెడ్డికి బెయిల్ మంజూరు చేశారు రెండవ అడిషనల్ జడ్జ్.
ఇక అటు బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ హౌజ్ అరెస్ట్ అయ్యారు. గచ్చిబౌలిలోని కేటీఆర్ నివాసం వద్ద భారీగా మోహరించిన పోలీసులు… బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ను హౌజ్ అరెస్ట్ అయ్యారు. పాడి కౌశిక్ రెడ్డి అరెస్ట్ నేపథ్యంలో కేటీఆర్ ను గృహ నిర్బంధం చేశారు పోలీసులు.