ఎలాన్ మస్క్ చేతికి టిక్‌టాక్.. బ్లూమ్‌బర్గ్ సంచలన కథనం

-

ప్రముఖ ఎంటర్మైన్‌మెంట్ షార్ట్ వీడియో అప్లికేషన్ టిక్‌టాక్‌పై అమెరికాలో నిషేధం కొనసాగుతున్న విషయం తెలిసిందే.ఈ క్రమంలోనే అమెరికాలో టిక్‌టాక్‌ను కార్యకలాపాలను ‘ఎక్స్‌’ అధినేత ఎలాన్‌ మస్క్‌కు విక్రయించాలని చైనీస్ కంపెనీ యోచిస్తున్నట్లు తెలుస్తోంది.ఈ క్రమంలోనే ‘బ్లూమ్‌బర్గ్‌ న్యూస్‌’ ఓ సంచలన కథనం వెల్లడించింది.

2017లో ప్రారంభమైన టిక్‌టాక్‌పై భారత్‌ సహా పలు దేశాల్లో నిషేధం కొనసాగుతోంది.అమెరికాలోని పలు రాష్ట్రాల్లో టిక్ టాక్ వినియోగంపై ఆంక్షలు కొనసాగుతున్నాయి. అమెరికా ప్రతినిధులు టిక్‌టాక్‌కు వ్యతిరేకంగా ఓ బిల్లుకు తీసుకొచ్చి ఆమోదం తెలిపారు.చైనా యాజమాన్యం టిక్‌టాక్‌ను వదులుకోకపోతే పూర్తిగా నిషేధం ఎదుర్కోవాల్సి వస్తుందని ఆ బిల్లులో పేర్కొంది. కాగా, టిక్‌టాక్ మాతృసంస్థ బైట్‌డాన్స్ నియంత్రణలో ఉండాలని చైనా అధికారులు కోరుకుంటున్నట్లు తెలుస్తోంది. చివరగా కంపెనీపై నిషేధాన్ని సవాల్ చేస్తూ అమెరికా సుప్రీంకోర్టుకు టిక్‌టాక్ అప్పీల్ చేస్తోందని ఓ నివేదిక తెలిపింది.

Read more RELATED
Recommended to you

Latest news