పీఎం కిసాన్‌ నిధి విడుదల దస్త్రంపై ప్రధాని తొలి సంతకం

-

భారతదేశ ప్రధానమంత్రిగా నరేంద్ర మోదీ మూడోసారి ప్రమాణ స్వీకారం చేశారు. ఆదివారం రోజున రాష్ట్రపతి భవన్లో కేంద్ర మంత్రులతో కలిసి ప్రధాని బాధ్యతలు స్వీకరించారు. ఈ నేపథ్యంలో ప్రధానిగా మూడోసారి బాధ్యతలు చేపట్టిన మోదీ.. తన తొలి సంతకం చేశారు. అయితే ఈసారి తన తొలి సంతకాన్ని మోదీ రైతుల కోసం చేశారు.

పీఎం కిసాన్‌ నిధి విడుదల చేస్తూ నరేంద్ర మోదీ తొలి సంతకం చేశారు. ఈ పథకం ద్వారా 9.3 కోట్ల మంది రైతులకు రూ.20 వేల కోట్ల ఆర్థిక సాయం విడుదల చేశారు. సౌత్‌ బ్లాక్‌లోని పీఎం కార్యాలయంలో ఆయన బాధ్యతలు చేపట్టిన అనంతరం ఈ దస్త్రంపై తొలి సంతకం చేశారు. ఈ సందర్భంగా మోదీ మాట్లాడుతూ.. రైతుల ప్రగతికి, భారతదేశ వ్యవసాయాభివృద్ధికి కృషి చేస్తానని హామీ ఇచ్చారు. దేశానికి వెన్నెముక అయిన రైతులకు తమ ప్రభుత్వం ఎప్పటికీ ఆసరాగా నిలుస్తుందని తెలిపారు. రైతుల కోసం ఈ టర్మ్లో ఎన్నో అభివృద్ధి కార్యక్రమాలు చేపడతామని చెప్పారు.

Read more RELATED
Recommended to you

Exit mobile version