బాలకృష్ణ ఓ పెద్ద కమెడియన్.. నాగ బాబు వ్యాఖ్యలపై నందమూరి ఫ్యాన్స్ ఆగ్రహం..!

-

రీసెంట్ గా మెగా బ్రదర్ నాగబాబు బాలకృష్ణ ఎవరో తనకు తెలియదనడం నందమూరి ఫ్యాన్స్ ను హర్ట్ చేసింది. వెంటనే నాగ బాబుని టార్గెట్ చేయడం మొదలుపెట్టారు. యూట్యూబ్ ఛానెల్ ఇంటర్వ్యూలో ఫ్యాన్స్ పంపించిన క్వశ్చన్స్ కు ఆన్సర్ ఇస్తూ బాలకృష్ణ మీద కామెంట్ చేయమని కోరగా అతనెవరో తనకు తెలియదు నెక్స్ట్ అనేశాడు నాగ బాబు.

ఏపిలో టిడిపి, జనసేన రాజకీయ పోటీలో ఓ పక్క బాబు, బాలకృష్ణలు పవన్ ను టార్గెట్ చేశారు. అందుకే నాగ బాబు వారిని టార్గెట్ చేశాడని అనుకోవచ్చు. సినిమాల మధ్య పోటీగా ఉన్న మెగా నందమూరి ఫైట్ కాస్త పొలిటికల్ గా జరుగనుంది. ఈ క్రమంలో నాగ బాబు కామెంట్స్ పై నందమూరి ఫ్యాన్స్ ఆగ్రహంతో ఊగిపోతున్నారు.

అయితే ఇంకా ఇది చాలదు అన్నట్టు నాగబాబు పెట్టిన మరో వీడియో నందమూరి ఫ్యాన్స్ కు మరింత షాక్ అయ్యేలా చేసింది. ఇంటర్వ్యూలో తాను బాలకృష్ణ ఎవరో తెలియదని తప్పుచేశా దానికి కొందరు హర్ట్ అయ్యారని తెలిసింది. తనకు బాలకృష్ణ తెలుసని ఆయన ఓ పెద్ద కమెడియన్ అని ఎన్.టి.ఆర్, కృష్ణలతో పనిచేసిన వళ్లూరి బాలకృష్ణ గురించి చెప్పాడు నాగ బాబు.

నాగ బాబు వళ్లూరి బాలకృష్ణ గురించి చెప్పిన విధానం చూస్తే కావాలని బాలకృష్ణ గురించి ఆయన మాట్లాడలేదని తెలుస్తుంది. రాం చరణ్, ఎన్.టి.ఆర్ ఇద్దరు స్నేహంగా ఉంటున్న ఈ టైంలో ఇలాంటి వ్యాఖ్యలు చేయడం కచ్చితంగా వారు చేస్తున్న ట్రిపుల్ ఆర్ ప్రాజెక్ట్ మీద కూడా ప్రభావం చూపించే అవకాశం ఉందని చెప్పొచ్చు. మరి వీటి పర్యావసానాలు ఎలా ఉంటాయో చూడాలి.

https://www.youtube.com/watch?v=FzFzDUzauEY

Read more RELATED
Recommended to you

Exit mobile version