ఎన్.టి.ఆర్ బయోపిక్ సినిమా మొదలుపెట్టగానే నందమూరి అభిమానుల్లో ఉత్సాహం ఉరకలు వేసింది. తేజ డైరక్షన్ లో మొదలైన ఈ సినిమా ఆ తర్వాత క్రిష్ చేతుల్లోకి వచ్చింది. గౌతమి పుత్ర శాతకర్ణి సినిమా చేసిన కాంబినేషన్ కాబట్టి ఎన్.టి.ఆర్ బయోపిక్ సినిమాపై కూడా అంచనాలు పెరిగాయి. మహానటి సినిమా తర్వాత బయోపిక్ సినిమాలకు మంచి క్రేజ్ ఏర్పడింది.
ఎన్.టి.ఆర్ బయోపిక్ సినిమాను ముందు సాయి కొర్రపాటి, విష్ణు ఇందూరిలతో పాటుగా బాలకృష్ణ కొంత నిర్మాణ బాధ్యతలను మీద వేసుకున్నాడు. అయితే సినిమా బడ్జెట్ రాబోతున్న బిజినెస్ అంచనా వేసిన బాలకృష్ణ ఇప్పుడు మిగతా ఇద్దరిని కాదని తానే సినిమా మొత్తం నిర్మించే బాధ్యత మీద వేసుకున్నాడట. ఇప్పటికే దానికి సంబందించిన సెటిల్మెంట్స్ జరుగుతున్నాయని తెలుస్తుంది.
ఈమధ్య రిలీజైన పోస్టర్స్ ఎన్.టి.ఆర్ బయోపిక్ పై మరింత అంచనాలను పెంచేస్తున్నాయి. ఓవర్సీస్ లో ఈ సినిమాకు 20 కోట్ల దాకా రేటు పలికిందని టాక్. మరి అంచనాలైతే భారీగా ఉండగా వాటిని ఎన్.టి.ఆర్ బయోపిక్ అందుకుంటుందా లేదా అన్నది మాత్రం తెలియాల్సి ఉంది.