ఉత్తమ తెలుగు చిత్రంగా భగవంత్ కేసరి చరిత్ర సృష్టించింది. 71వ జాతీయ చలనచిత్ర పురస్కారాలను కేంద్రం ప్రకటించింది. అన్ని భాషల్లో 15 విభాగాల్లో అవార్డులను ఇస్తున్నట్లు జ్యూరీ వెల్లడించింది. ఉత్తమ తెలుగు చిత్రంగా బాలకృష్ణ నటించిన భగవంత్ కేసరిని అవార్డు వరించింది.

ఉత్తమ గేయ రచయితగా ‘బలగం’లో ‘ఊరు పల్లెటూరు’ పాటకు గానూ కాసర్ల శ్యామ్ అవార్డును సొంతం చేసుకున్నారు. ఉత్తమ యాక్షన్ (స్టంట్ కొరియోగ్రఫీ)లో ‘హను-మాన్’ చిత్రం అవార్డు దక్కించుకుంది.