లోకేష్‌కు హరీష్ మాస్ వార్నింగ్ ఇచ్చారు. బనకచర్ల ప్రాజెక్టుపై లోకేష్ పిచ్చి మాటలకు కౌంటర్ ఇచ్చారు. లోకేష్ బనకచర్ల వ్యాఖ్యలపై రేవంత్ ఎందుకు స్పందించట్లేదని ఫైర్ అయ్యారు. పొక్కలు కొట్టుకొని నీళ్లు తీసుకెళ్లేందుకు, ఇది ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ కాదన్నారు.

మిగులు జలాలపై లోకేష్‌కు అవగాహన లేకుండా అబద్దాలు మాట్లాడుతున్నారని అందిపడ్డారు. రేవంత్ రెడ్డి బలం చూసుకొని బనకచర్లపై లోకేష్ మాట్లాడుతున్నాడు…. బీజేపీ మా చేతుల్లో ఉంది.. మేం ఏం చెప్తే అదే చేస్తారని అనుకుంటే ఉరుకోబోమని ఫైర్ అయ్యారు.
బీజేపీ తమ పీఠాన్ని ఢిల్లీలో కాపాడుకునేందుకు టీడీపీకి సహకరిస్తున్నారు… కాళేశ్వరం ప్రాజెక్టుకు ఒకటి కాదు రెండు కాదు 11 అనుమతులు ఉన్నాయని పేర్కొన్నారు. కాళేశ్వరం ప్రాజెక్టును రద్దు చేయాలని, ఆపాలని బాబు ఏడు లేఖలు రాశారని గుర్తు చేశారు.