గాడ్ ఆఫ్ మాసెస్ నందమూరి బాలకృష్ణ హీరోగా నటించిన మూవీ డాకు మహారాజ్. బాబీ దర్శకత్వం వహించిన ఈ చిత్రం ఇవాళ విడుదలైంది. ఈ సినిమా పాజిటివ్ టాక్ తో దూసుకెళ్తోంది. అయితే డాకు మహారాజ్ సినిమా చూసి పలువురు అభిమానులు బాలయ్యకు ఫోన్ చేసి మాట్లాడారు. బాలయ్య యాక్షన్ కి థమన్ మ్యూజిక్ కి తోడై సినిమా అదిరిపోయిందని సినీ లవర్స్ అంటున్నారు. ఈ నేపథ్యంలో డాకుమహారాజ్ సినిమా చూసి బయటికి వచ్చిన అభిమానులు బాలయ్యతో ఫోన్ లో మాట్లాడారు.
ముఖ్యంగా బాలకృష్ణ ఫ్యాన్స్ అధ్యక్షుడు గౌస్ మొయిద్దీన్ మాట్లాడుతూ సినిమా బ్లాక్ బస్టర్ హిట్ అని, మీ నటనకు ఫిదా అయ్యానని.. యాక్షన్, సెంటిమెంట్ సీన్లు చాలా బాగున్నాయని బాలయ్యకు చెప్పినట్టు వెల్లడించారు. అంతేకాదు.. బాలయ్యకు వరుసగా నాలుగు హిట్లు అంటూ సంతోషం వ్యక్తం చేశారు. మరోవైపు బాలయ్య ఫ్యాన్స్ అసోసియేషన్ మెంబర్ జగన్ మాట్లాడుతూ బాలయ్య నటనను తెగ మెచ్చుకున్నారు. డాకు మహారాజ్ సూపర్ హిట్ అని.. వరుస విజయాలు అందుకోవడం చాలా ఆనందంగా ఉందని తెలిపారు.