త్రివిక్రమ్​పై బండబూతులు.. ఆడియో లీక్​పై బండ్ల గణేశ్ క్లారిటీ

-

వివాదస్పద వ్యాఖ్యలతో ఎప్పుడూ వార్తల్లో నిలిచే న‌టుడు, నిర్మాత‌ బండ్ల గ‌ణేష్ మరోసారి హాట్​టాపిక్​ అయ్యారు. భీమ్లా నాయ‌క్ ప్రీ రిలీజ్ ఈవెంట్​ స‌మ‌యంలో త‌న వాయిస్‌తో లీక్​ అయిన ఆడియో టేప్‌పై బాంబ్ పేల్చారు. అప్పట్లో అది తనది కాదని చెప్పిన ఆయన.. తాజాగా అది తనదేనని ఒప్పుకున్నారు.

ప‌వ‌న్ క‌ళ్యాణ్ ఈవెంట్‌లలో బండ్ల గ‌ణేష్ మాట్లాడే మాటల‌ు సోషల్​ మీడియాలో వైరల్​ అవుతాయి అన్న సంగతి తెలిసిందే. వ‌కీల్ సాబ్ ప్రీ రిలీజ్ ఈవెంట్‌లో బండ్ల గ‌ణేష్ స్పీచుకు భారీ రెస్పాన్స్​ వచ్చింది. అయితే అదే ఊపుతో ఆయన.. భీమ్లా నాయ‌క్ ప్రీ రిలీజ్ ఈవెంట్​కు స్పీచ్​తో రెడీ అయ్యారు. కానీ త్రివిక్ర‌మ్ మ‌ధ్య‌లో కలుగజేసుకుని కార్యక్రమానికి ఆయ‌న్ను రానీయ‌లేదని టాక్ నడిచింది​. దీంతో బండ్ల గణేశ్​.. త్రివిక్రమ్​పై ఓ రేంజ్‌లో సీరియ‌స్ అయ్యారు. వాడు, వీడు అంటూ రెచ్చిపోయి తిట్టారు. ఆ ఆడియో బ‌య‌ట‌కు కూడా లీకై సంచ‌న‌లంగా మారింది.

అయితే బండ్ల గణేష్ పలు సార్లు ఆ ఆడియో టేప్ తనది కాదన్నట్లుగానే చెప్పే ప్రయత్నం చేశారు. అయితే తాజా ఇంటర్వ్యూలో మాత్రం ‘ఏదో కోపంలో అలా అనేశాను’ అంటూ ఆ వాయిస్ తనదే అని ఒప్పుకున్నారు. ఇప్పుడు అంతా బాగానే ఉందని దాన్ని, వివాదం చేయాల్సిన అవసరం లేదని పేర్కొన్నారు.

పవన్ కళ్యాణ్​తో మళ్ళీ సినిమా చేయాలని కోరుకుంటున్నట్లుగా అన్నారు. కాగా, మొదట ఆ ఆడియోను చాలా మంది ఫేక్ అనుకున్నారు, బండ్ల గణేష్ అలా మాట్లాడి ఉండడని భావించారు. పవన్ కళ్యాణ్​- బండ్ల గణేష్​కు మధ్య త్రివిక్రమ్ దూరం పెంచే ప్రయత్నాలు చేస్తున్నారని ఆ ఆడియో టేప్ సారాంశం.

Read more RELATED
Recommended to you

Exit mobile version