తమిళ్ స్టార్ హీరో విజయ్ నటించిన తాజా సినిమా బీస్ట్. ఈ సినిమా ఇవాళ ప్రపంచ వ్యాప్తంగా థియేటర్లలో విడుదల అయింది. అయితే.. హీరో విజయ్ సొంత రాష్ట్రమైన తమిళనాడు ఈ సినిమా టికెట్ ధర రూ.199 కాగా.. అదే హైదరాబాద్ లో మాత్రం రూ.295 గా ఉంది. అయినప్పటికీ.. జనాలు ఎగబడి సినిమా చేస్తున్నారు.
ఇక సినిమాపై పాజిటివ్ టాక్ రావడంతో.. రూ.295 పెట్టడానికి కూడా సిద్ధంగా ఉన్నారు. అయితే.. తమిళనాడులో తక్కువ, ఇక్కడ ఎక్కువ టికెట్లు ఉండటంపై ట్రోల్స్, మీమ్స్ సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.
తాజాగా ఈ ట్రోలింగ్ పై కాంట్రవర్సియల్ దర్శకుడు బండి సరోజ్ కుమార్ తన సోషల్ మీడియాలో స్పందించారు. మేం బలిసినోళ్లం రా భై అంటూ సెటైరికల్ గా స్పందిస్తూ.. బీస్ట్ టికెట్ రేట్ల మీద వచ్చిన మీమ్ ను షేర్ చేశాడు. ఇక ముందు ముందు ఏ కొత్త సినిమా వచ్చినా కూడా ఈ రేంజ్ లోనే కొంటామంటూ ట్వీట్ చేశాడు. అయితే… బండి సరోజ్ కుమార్ చేసిన ట్వీట్ వైరల్ గా మారింది.
మేం బలిసినోళ్ళంరా భై 👿#TicketPrices#TamilNadu #Telangana #Beast pic.twitter.com/4TmITOhFZx
— Bandi Saroj Kumar (@bsk_cult_garage) April 12, 2022