అక్కినేని హీరోలు నాగర్జున, నాగ చైతన్య కలిసి చేసిన మల్టీ స్టారర్ సినిమా బంగార్రాజు. 2016 లో వచ్చిన సోగ్గాడే చిన్ని నాయనా సినిమాకు సీక్వెల్ గా డైరెక్టర్ కళ్యాణ్ కృష్ణ కురసాల తెరకెక్కించాడు. ఈ సినిమాలో నాగర్జునకు జోడీ రమ్యకృష్ణ, నాగ చైతన్య సరసన యంగ్ హీరోయిన్ కృతి శెట్టి నటించారు. అన్నపూర్ణ స్టూడియోస్, జీ స్టూడియోస్ సంయుక్తంగా నిర్మించిన ఈ సినిమా ఈ ఏడాది సంక్రాంతి కానుకగా జనవరి 14న తెలుగు ప్రేక్షకుల ముందుకు వచ్చింది.
రూ. 25 కోట్ల బడ్జెట్ తో తెరకెక్కిన ఈ సినిమా.. బాక్సాఫీస్ వద్ద రూ. 63. 87 కోట్లు సంపాధించినట్టు అంచనా. కాగ ఈ సినిమా ఇప్పుడు ఓటీటీ లో విడుదలకు సిద్ధం అవుతుంది. ప్రముఖ ఓటీటీ ప్లాట్ ఫాం అయిన జీ5 లో బంగార్రాజు సినిమా విడుదల కాబోతుంది. ఈ నెల 18 నుంచి జీ 5 లో ప్రసారం కాబోతుంది. అయితే థియేటర్స్ లో మంచి విజయం అందుకున్న బంగార్రాజు ఓటీటీలో ఎంత ప్రభావం చూపుతుందో చూడాలి మరి