నేను అదృష్టాన్ని నమ్మను కష్టాన్ని మాత్రమే నమ్ముతాను… రవితేజ..!

-

మాస్ మహారాజా రవితేజ ప్రస్తుతం నటించిన సినిమాలలో ఖిలాడి సినిమా ఒకటి. ఈ సినిమా ఇప్పటికే అన్ని పనులను పూర్తి చేసుకొని విడుదలకు సిద్ధంగా ఉంది. ఈ సినిమాను ఫిబ్రవరి 11వ తేదీన విడుదల చేయబోతున్నారు. ఈ సినిమా ఈ సినిమాకు వర్మ దర్శకత్వం వహిస్తుండగా ఈ సినిమాలో రవితేజ సరసన టెంపుల్ హయాతి, మీనాక్షి చౌదరి హీరోయిన్ లుగా నటించారు. ఇప్పటికే ఈ సినిమా నుండి విడుదల చేసిన ప్రచార చిత్రాలకు ప్రేక్షకుల నుండి మంచి రెస్పాన్స్ దక్కుతుంది. ఈ సినిమా విడుదల తేదీ దగ్గర పడటంతో ఈ చిత్ర బృందం ప్రమోషన్ ల స్పీడ్ ను పెంచింది.

ఈ సంద‌ర్భంగా బుధ‌వారం రాత్రి హైద‌రాబాద్‌లోని పార్క్ హ‌య‌త్ హోట‌ల్‌లో ఖిలాడి సినిమా ప్రీ రిలీజ్‌ వేడుక ఘ‌నంగా జ‌రిగింది. బిగ్ టికెట్ ను దర్శకుడు బాబి ఆవిష్కరించాడు. ఖిలాడి ఫ్రీ రిలీజ్ ఈవెంట్ లో భాగంగా రవితేజ మాట్లాడుతూ.. నేను అదృష్టాన్ని జాతకాన్ని నమ్మను.. నేను కష్టాన్ని నమ్ముతాను.. అదృష్టం అనేది ఏదో ఒక‌శాతం మాత్ర‌మే ఉంటుంది అని రవితేజ తెలియజేశాడు.ఇక ఖిలాడి మూవీ విష‌యానికి వ‌స్తే ముందుగా మూవీ ని ఫిబ్రవరి 18 న విడుదల చేయాలని అనుకున్నాం.

కానీ సినిమా పనులన్నీ ముందుగానే ముగియడంతో ఫిబ్రవరి 11 న విడుదల చేస్తున్నాం. నిర్మాత కోనేరుసత్యనారాయణగారు మంచి నటీనటులనే కాదు టాప్ టెక్నీషియనన్స్‌ను కూడా దర్శకుడు కు రమేష్ వర్మ అందించాడు.దర్శకుడు రమేష్ వర్మ మ‌హార్జాత‌కుడు. సినిమా విడుదలకు ముందే నిర్మాత నుండి కారు గిఫ్టుగా అందుకున్నాడు. రాక్ స్టార్ తో కొంత గ్యాప్ వచ్చింది కానీ ఇకపై ఆ గ్యాప్ రాదు పాటలన్నీ చాలా బ్యూటిఫుల్ గా ఉన్నాయి కిల్ కిల్ ఖిలాడి.. అనే పాట ఈ సినిమాలో నా ఫేవరెట్ అని రవితేజ తెలియజేశాడు.

Read more RELATED
Recommended to you

Latest news