బ్యూటీ స్పీక్స్ : ప‌ల్ల‌వించ‌వా నా గొంతులో !

-

కొన్నిసార్లు త‌డ‌బ‌డే అడుగులు
అన్నిసార్లు త‌డ‌బ‌డ‌నీయ‌ని చూపులు
ఇంకా ఇంకొన్ని న‌వ్వులు
విస్మ‌యం అనిపించే క‌నుబొమ్మ‌లు
ఇంకా వాటి ఊసులు మ‌రియు ఊహ‌లు
వెర‌సి సాయి ప‌ల్ల‌వులు…. ఈ వేళ…
అందానికి అందం ఈ బొమ్మ.. అంద‌రికీ అంద‌నిదీ ఈ బొమ్మ అందాల బొమ్మ..అంద‌నిదీ బొమ్మ..అన్న పాట‌ను త‌లుచుకోవాలి. మ‌ధుర క‌విత‌కు అక్ష‌ర రూపం ఇచ్చుకుంటూ వెళ్లాలి.. అప్పుడు మ‌ధుర సుధా చ‌రిత ఏంట‌న్న‌ది తెలియ‌వ‌స్తుంది. సాయి ప‌ల్ల‌వి అనే ఓ ప్ర‌తిభావ‌ని ప‌ల‌క‌రింపుల‌తో ఈ సాయంత్రం శీత‌ల గాలుల స‌య్యాట‌లు మ‌రో మ‌లుపు తీసుకుంటాయి.

ఓయ్ పిల్లా ఆగ‌వేం అని భానుమ‌తి ని చూసి అనాలి.మ‌తి పోతుంది అప్పుడు.. ఆమె పిలుపు విని ఆగిపోయాక ఏవో చెప్పాల‌ని అనిపించాక మ‌న‌సు నుంచి ఓ వేద‌న మాత్రం ఇష్ట‌మ‌యిన ప్రియుడికి ఇష్టం అయిన స‌మయంలో మిగిలి ఉంటుంది. ప్రేమ చేదు అయి ఉందో లేదో కానీ ఉన్న మాట చెప్ప‌కుండా దాగిపోయిన ఆనందాలు కొన్ని మాత్రం మ‌నుషులను తిక‌మ‌క‌కు గురిచేస్తాయి. క‌నుక అలాంట‌ప్పుడు ఊసు పోదు ఊరుకోదు అన్న విధంగానే ఉంటుంది మ‌న‌సు.

య‌వ్వ‌న ప్రాయంలో గాయాలు ఎలా ఉంటాయి..య‌వ్వ‌న ప్రాయ‌న ప‌ర‌కాయ ప్ర‌వేశం చేసిన ప్రేమ ఎలా ఉంటుంది. సాయి ప‌ల్ల‌వి మాట్లాడుతూ ఉంటూ కిన్నెర గానాలు వినిపిస్తాయా.లేదా కుడి భుజం మీద క‌డ‌వ‌లో నీళ్ల స‌య్యాట‌లు గుర్తుకు వ‌చ్చి సారంగ ఝ‌రి వినిపిస్తుందా? అది ర‌మ్మంటే రాదు రా చెలియా దాని పేరే సారంగ ద‌రియా అని ఓ పాట లీలా మాత్రంగా వినిపిస్తుందా? ఏమో కానీ మ‌ల‌యాళ తీరం నుంచి న‌డుచుకువ‌చ్చిన ఈ సోయ‌గం తెలంగాణ సంస్కృతిలో భాగం అయిపోవ‌డమే భ‌లే విడ్డూరం.

అత్యంత ప్రాధాన్యం ఉన్న ప్రేమ క‌థ‌ల‌కు అత్యంత ప్రాధాన్యం ఇస్తూ న‌టించే ఈ భామ ఈ సాయంత్రం వేళ ఇంకొన్ని ఊసులు క‌ళ్ల‌తోనే ఒలికిస్తుంది.. ప‌లికిస్తుంది. తెలుసుగా భాను మ‌తి అంటే మ‌తి పోగొట్టే అందం. సింగిల్ పీస్ .. అంతే! ఇంకెందుకు ఆల‌స్యం హైబ్రీడ్ పిల్ల ఊసులు మ‌రో సారి త‌లుచుకుని ఈ రేయి చెంత నిద్దుర‌పొండి.

– చిత్ర క‌థంబం – మ‌న లోకం ప్ర‌త్యేకం

Read more RELATED
Recommended to you

Exit mobile version