సీఎంఆర్ గర్ల్స్ కాలేజ్ కేసును సుమోటాగా తీసుకున్న ఉమెన్ కమిషన్ చైర్మన్..!

-

సీఎంఆర్ గర్ల్స్ కాలేజ్ చేరుకొని విద్యార్థినిలతో మాట్లాడారు ఉమెన్ కమిషన్ మెంబర్ పద్మజా రమణ. అనంతరం ఆవిడ మాట్లాడుతూ.. సీఎంఆర్ గర్ల్స్ కాలేజీలో జరిగిన ఘటనపై స్టూడెంట్స్ నుంచి స్టేట్మెంట్ రికార్డ్ చేశాము. పూర్తి వివరాలు విమెన్ కమిషన్ చైర్మన్ కి అందజేస్తాము. అయితే ఉమెన్ కమిషన్ చైర్మన్ సుమోటాగా కేసు తీసుకున్నారు . ఈ ఘటనపై సీఎంఆర్ కాలేజ్ మేనేజ్మెంట్ కి నోటీసులు ఇచ్చాము అని తెలిపారు.

అలాగే విచారణలో నిజాలు తెలిన తర్వాత సిఎంఆర్ గర్ల్స్ కాలేజీ యాజమాన్యంపై సీరియస్ ఆక్షన్ ఉంటుంది . ఇక్కడ జరిగిన వాస్తవాలు రిపోర్ట్ రుయంలో రాష్ట్ర ఉమెన్ కమిషన్ చైర్మన్ కు అందజేస్తాం అని పేర్కొన్నారు. అయితే ఇప్పటికే ఈ ఘటన విషయంలో వార్డెన్ ప్రీతి రెడ్డి ని సస్పెండ్ చేసారు యాజమాన్యం డైరెక్టర్ జంగారెడ్డి. ప్రస్తుతం పోలీసులు అదుపులో ఉన్నారు ప్రీతి రెడ్డి.

Read more RELATED
Recommended to you

Exit mobile version