రీమేక్ సెంటిమెంట్ నే నమ్ముకుంటున్న బెల్లంకొండ.. మళ్లీ అక్కడి సినిమాతోనే..

ఇండస్ట్రీలో మంచి గుర్తింపు ఉన్న ఫ్యామిలీ నుంచి వచ్చాడు బెల్లంకొండ సాయి శ్రీనివాస్. తండ్రి పెద్ద నిర్మాత. ఇంకేంటి వరుసగా పెద్ద సినిమాలు లైన్ లో పెట్టేశాడు. కానీ మనోడికి లక్ మాత్రం పెద్దగా కలిసి రాలేదు. వరుసగా ప్లాప్ లు రావడంతో సతమతమయ్యాడు. దీంతో ఓ రీమేక్ సినిమాను నమ్ముకున్నాడు. అది మంచి హిట్ కొట్టింది. ఈ జోష్ తో మళ్లీ వరుసగా సినిమాలు చేశాడు. కానీ మళ్లీ ప్లాపులు క్యూ కట్టాయి. దీంతో చేసేది లేక మళ్లీ రీమేక్ సెంటిమెంట్ ను నమ్ముకుంటున్నాడు.

అల్లుడు శ్రీనుతో మొదటి సినిమాతో హిట్‌ కొట్టిన శ్రీనివాస్.. ఆ తర్వాత పెద్దగా సక్సెస్ సాధించలేకపోయాడు. దీంతో తమిళ రీమేక్‌ రాక్షసుడుతో హిట్ ట్రాక్ ఎక్కాడు. ప్రస్తుతం బెల్లంకొండ రాజమౌళి దర్శకత్వంలో వచ్చిన ఛత్రపతి సినిమాను బాలీవుడ్ లో రీమేక్ చేస్తున్నాడు.

ఇక ఈ సినిమా తర్వాత మరో రీమేక్ కు జై కొట్టాడని తెలుస్తోంది. రీసెంట్ తమిల్ లో ధనుష్‌ హీరోగా వచ్చిన కర్ణన్ మంచి హిట్ కొట్టింది. దీంతో ఈ మూవీని తెలుగులో రీమేక్‌ చేయాలని అనుకుంటున్నాడట బెల్లంకొండ. ఇందుకోసం ఇప్పటికే ఈ మూవీ రైట్స్‌ను కొనుగోలు చేసినట్లు సమాచారం. మరి ఈసారి కూడా తన సెంటిమెంట్ నిలుస్తుందా లేక దెబ్బ కొడుతుందో చూడాలి.