పోనీటేల్‌తో బెల్లంకొండ న్యూ లుక్‌!

-

మాస్ ఎంట‌ర్‌టైన‌ర్ల‌తో హీరోగా మంచి గుర్తింపుని సొంతం చేసుకున్నాడు బెల్లంకొండ శ్రీ‌నివాస్‌. ప్ర‌స్తుతం ఫ్యామిలీ ఎంట‌ర్‌టైన‌ర్‌గా వ‌స్తున్న `అల్లుడు అదుర్స్‌` చిత్రంలో న‌టిస్తున్నాడు. ఈ మూవీ షూటింగ్ ఇటీవ‌లే మొద‌లైంది. ఇందులో ఎంట‌ర్‌టైన్‌మెంట్ ప్ర‌ధానంగా బెల్లంకొండ శ్రీ‌నివాస్ క్యారెక్ట‌ర్ వుంటుంద‌ట. కొన్ని స‌న్నివేశాల్లో రెట్రో లుక్‌తో క‌నిపించ‌బోతున్నాడు.

ఇటీవ‌లే ఆ లుక్‌కి సంబంధించిన ఓ ఫొటో బ‌య‌టికి వ‌చ్చి సోష‌ల్ మీడియాలో వైర‌ల్గా మారింది. తాజాగా మ‌రో పిక్ బ‌య‌టికి వ‌చ్చింది. కంప్లీట్ డిఫ‌రెంట్ లుక్‌లో గుబురు గ‌డ్డం, పోనీ టేల్‌తో బ్లాక్ గాగుల్స్‌తో బెల్లంకొండ స‌రికొత్త‌గా క‌నిపిస్తున్నాడు. మాస్ హీరోగా క‌నిపించి ఆక‌ట్టుకున్న బెల్లంకొండ శ్రీ‌నివాస్ త‌జా చిత్రంలో డిఫ‌రెంట్ లుక్స్‌తో క‌నిపించి స‌ర్‌ప్రైజ్ ఇవ్వ‌బోతున్నాడ‌ట. ప్ర‌స్తుతం ఈ పిక్ సోష‌ల్ మీడియాలో వైర‌ల్‌గా మారింది.

Read more RELATED
Recommended to you

Exit mobile version