సహజంగా వాస్తు పండితులు మరియు జ్యోతిష్యులు ఎన్నో సలహాలను ఇస్తూ ఉంటారు. వాటిని పాటించడం వలన ఎన్నో ఇబ్బందుల నుండి బయటపడవచ్చు. ముఖ్యంగా ఆర్థిక సమస్యల నుండి బయట పడాలంటే జ్యోతిష నిపుణుల సలహాలను తప్పకుండా తీసుకోవాలి. చాలా శాతం మంది సంతోషంగా ఉండాలని భావిస్తారు కాకపోతే ఎన్నో కారణాల వలన అదృష్టం ఉండదు. కనుక కొన్ని మార్పులను చేయడం వలన అదృష్టాన్ని పొందవచ్చు. శుభ ఫలితాల కోసం కొంతమంది జ్యోతిష్య నిపుణులు తాబేలు ఉంగరాన్ని ధరించమని చెబుతూ ఉంటారు. తాబేలు ఉంగరం తో పాటుగా కొన్ని రకాల రంగు రాళ్ళను కూడా ధరించమని సూచిస్తారు. ఇలా చేయడం వలన లక్ష్మీదేవి అనుగ్రహాన్ని పొందవచ్చు అని అందరూ భావిస్తారు.
జ్యోతిష్య శాస్త్రం ప్రకారం ఎవరైతే తాబేలు ఉంగరాన్ని ధరిస్తారో వారికి ఎంతో మంచి జరుగుతుంది. తాబేలు ఉంగరాన్ని ధరించడం వలన ఆర్థిక ఇబ్బందులు కూడా తగ్గుతాయి. అదేవిధంగా లక్ష్మీదేవి కటాక్షాన్ని కూడా పొందవచ్చు. కాకపోతే ఈ ఉంగరాన్ని ధరించే ముందు దానిని శుద్ధి చేయాలి. గంగాజలం, పాలు వంటి వాటిలో ఉంగరాన్ని కొంచెం సేపు ఉంచి తర్వాత పెట్టుకోవాలి. ఇలా చేయడం వలన ఉంగరం శుద్ధి అవుతుంది, దీంతో లక్ష్మీదేవి కటాక్షాన్ని పొందవచ్చు. కేవలం శుద్ధి చేయడం మాత్రమే కాకుండా లక్ష్మీదేవి అనుగ్రహాన్ని పొందాలి అంటే లక్ష్మీదేవి పాదాల దగ్గర ఉంగరాన్ని పెట్టి దానికి పూజ చేయాలి.
ఇలా చేయడం వలన లక్ష్మీదేవి అనుగ్రహాన్ని పొందవచ్చు. జ్యోతిష్య నిపుణుల ప్రకారం గురువారం తాబేలు ఉంగరాన్ని శుద్ధి చేసి, పూజించిన తర్వాత శుక్రవారం నాడు ధరించడం వలన ఎంతో మంచి ఫలితాన్ని పొందవచ్చు. అయితే తాబేలు ఉంగరాన్ని చూపుడు వేలుకు లేక మధ్య వేలుకు కానీ పెట్టుకోవచ్చు. కాకపోతే కేవలం కుడి చేతికి మాత్రమే ఈ ఉంగరాన్ని ధరించాలి. తాబేలు ఉంగరాన్ని పెట్టుకున్నప్పుడు తాబేలు ముఖం మీ వైపు ఉండాలి. ఈ విధంగా తాబేలు ఉంగరాన్ని ధరించడం వలన ఎంతో మార్పుని గమనిస్తారు మరియు ఎన్నో ఇబ్బందులు కూడా తొలగిపోతాయి.