‘భామాకలాపం 2’ ట్రైల‌ర్ రిలీజ్.. ప్రియమణి యాక్ష‌న్ అదుర్స్

-

టాలీవుడ్ హీరోయిన్ ప్రియమణి ప్ర‌ధాన పాత్ర‌లో న‌టించిన మూవీ భామా కలాపం. 2022లో ఓటీటీలో విడుదలైన ఈ సినిమా ప్రేక్షకాదరణ పొందింది. ఈ సినిమాకు వచ్చిన క్రేజ్ తో దానికి సీక్వెల్ గా భామాకలాపం 2ను తెరకెక్కిస్తున్న విషయం తెలిసిందే. పార్ట్-2లో కూడా ప్రియమణి ప్రధాన పాత్ర పోషించారు. అభిమన్యు దర్శకత్వం వహించిన ఈ సినిమా ఫ‌స్ట్ లుక్‌తో పాటు టీజ‌ర్ విడుద‌ల చేసిన విషయం తెలిసిందే. వీటికి కూడా సూపర్ రెస్పాన్స్ వచ్చింది. ఇక తాజాగా మూవీ మేకర్స్ భామాకలాపం 2 ట్రైలర్ రిలీజ్ చేశారు.

అనుపమ (ప్రియమణి) తన సొంత యూట్యూబ్ ఛానల్ ద్వారా వ‌చ్చిన మ‌నీతో హోటల్ పెట్టుకుందామని అనుకుంటుందనే విషయం ట్రైలర్ చూస్తే అర్థమవుతోంది. ఈ క్ర‌మంలోనే కుకింగ్ ఐడ‌ల్ 2023 సీజ‌న్ స్టార్ అవుతుంది. కుకింగ్ ఐడ‌ల్ 2023లో పాల్గొనడానికి వెళ్లిన అనుపమ అక్కడ ఎలాంటి పరిస్థితులు ఎదుర్కొంది. అనుప‌మ‌కు డ్రగ్స్‌కు సంబంధం ఏంటి అనే విషయాలను తెలుసుకోవాలంటే ఈ సినిమా చూడాల్సిందే. ఇక ఈ సినిమా ఫిబ్రవరి 16 నుంచి ఆహాలో డైరెక్ట్‌గా స్ట్రీమింగ్ కానుంది.

Read more RELATED
Recommended to you

Latest news