Bheemla Nayak Pre Release : బండ్ల వ‌స్తాడా..?? రాడా.? నెట్టింట ఆగ‌మాగం

-

ప‌వ‌ర్ స్టార్ ప‌వ‌న్ క‌ళ్యాణ్ బీమ్లా నాయ‌క్ ప్రీరిలీజ్ ఈవెంట్ ఎంతో గ్రాండ్‌గా జ‌ర‌గ‌నుంది. నిన్న విడుద‌లైన బీమ్లా నాయ‌క్ ట్రైల‌ర్‌కి మంచి స్పంద‌న వ‌స్తుంది. అయితే ఈ ఈవెంట్‌కి ప‌వ‌న్ భ‌క్తుడు బండ్ల గ‌ణేష్ వ‌స్తున్నాడా లేదా అని నెట్టింజ‌న్స్ సోష‌ల్ మీడియాలో తెలుసుకునే ప్ర‌య‌త్నం చేస్తున్నారు. అదేంటీ బండ్ల గ‌ణేష్ ప్ర‌తీ ఈవెంట్‌కి వ‌స్తాడు.. ఈ ఈవెంట్‌కి వ‌స్తే వ‌స్తాడు లేక పోతే లేదు.. ఎందుకంత?? ఆయ‌న‌కు ఈ సినిమాకు ప్ర‌త్యేకంగా లింకేం లేదుగా అనేగా మీ అనుమానం.. అక్క‌డికే వ‌స్తున్నాం..

బండ్ల గ‌ణేష్ తో ఒక అభిమానికి జ‌రిగిన సంభాష‌ణ అంటూ ఓ ఆడియో నెట్టింట హ‌ల్‌చ‌ల్ చేసింది. బండ్ల గ‌ణేష్‌కి ఆహ్వానం లేదని… త్రివిక్ర‌మ్ అడ్డుకుంటున్నాడ‌నేది ఆ ఆడియో సారాంశం. పూర్తి వివరాల్లోకి వెళితే.. వైసీపీ నేతలతో కుమ్మక్కు అయ్యాడంటూ త్రివిక్రమ్‌ పై బండ్ల గణేష్‌ చేసిన వ్యాఖ్యలు సోషల్‌ మీడియాలో వైరల్‌ గా మారాయి. బీమ్లా నాయక్‌ ప్రీ రిలీజ్‌ ఈవెంట్‌ నేపథ్యంలో రెండు రోజుల కింద ఓ ఫ్యాన్‌ బండ్ల గణేష్‌ కు కాల్‌ చేశాడు. బండ్ల గణేష్‌ అన్న.. బీమ్లా నాయక్‌ ప్రీ రిలీజ్‌ ఈవెంట్‌కు మీరు వెళుతున్నారా అంటూ ఆ అభిమాని ప్రశ్నించారు.

అవును పోతున్నాను.. కానీ త్రివిక్రమ్‌ గాడు నన్ను వద్దంటూన్నాడట అంటూ వివాదస్పద వ్యాఖ్యలు చేశారు బండ్ల గణేష్‌. వైసీపీతో కుమ్మక్కు అయి… క్రేజ్‌ పెంచుకోవాలని త్రివిక్రమ్‌ చూస్తున్నాడని పేర్కొన్నాడు. కానీ ప్రీ రిలీజ్‌ ఈవెంట్‌ లో “బండ్ల గణేష్‌” అన్న అంటూ అరవండని ఆ ఫ్యాన్ సూచించాడు. అయితే.. దీనికి సంబంధించిన ఓ ఆడియో టేప్‌ సోషల్‌ మీడియాలో వైరల్‌ గా మారింది.

ఈ నేపథ్యంలోనే బండ్ల గణేష్‌ ఇవాళ ఈవెంట్ కు వస్తాడా ? రాడా ? అనేది అందరిలోనూ ఉత్కంటతను రేపుతోంది. అయితే బండ్ల గణేష్ ఫ్యాన్స్ మాత్రం… ఆయన రావాలని కోరుకుంటున్నారు. బండ్ల గణేష్ అస్సలు ఈవెంట్కు రావద్దని ఆయన వ్యతిరేకులు సోషల్ మీడియా లో లో కామెంట్ చేస్తున్నారు. ఒకవేళ.. బండ్ల గణేష్ వస్తే… స్టేజ్ పైన ఇలాంటి కామెంట్స్ చేస్తారోనని అందరూ ఎదురుచూస్తున్నారు. మొత్తానికి… బండ్ల గణేష్ ఎంట్రీ పైనే అందరి దృష్టి ఉంది.

Read more RELATED
Recommended to you

Exit mobile version