కార్యకర్తలు, నేతలతో రేపు జగ్గారెడ్డి కీలక సమావేశం

-

సంగారెడ్డి ఎమ్మెల్యే జగ్గారెడ్డి వ్యవహారం తెలంగాణ కాంగ్రెస్ లో చిన్నపాటి ప్రకంపనలు కలిగిస్తోంది. ఇప్పటికే కాంగ్రెస్ పార్టీకి రాజీనామా చేస్తున్నానని ప్రకటించారు. అవసరమైతే నేనే కొత్త పార్టీ పెడుతానంటూ సంచలన వ్యాఖ్యలు చేశారు. తన రాజీనామా ప్రకటన తరువాత కాంగ్రెస్ సీనియర్ నేతలు జగ్గారెడ్డిని బుజ్జగించే ప్రయత్నం చేశారు. దీంతో కాస్త మెత్తబడితన జగ్గారెడ్డి 15 రోజుల పాటు రాజీనామా నిర్ణయాన్ని వాయిదా వేశారు. తనకు రాహుల్ గాంధీ, సోనియా గాంధీ అపాయింట్ ఇప్పించాలని.. తన బాధను వారికి వివరిస్తా అని అన్నారు.

ఇదిలా ఉంటే రేపు సంగారెడ్డిలో పార్టీ నాయకులు, కార్యకర్తలతో ఎమ్మెల్యే జగ్గారెడ్డి సమావేశం కానున్నారు. రేపటి సమావేశంలో నాయకులు, కార్యకర్తల అభిప్రాయాలను తెలుసుకోనున్నారు జగ్గారెడ్డి. రేపటి సమావేశం కాంగ్రెస్ పార్టీలో హాట్ టాపిక్ గా మారింది. రేపటి సమావేశంలో ఎలాంటి నిర్ణయాలు తీసుకుంటారో అని కాంగ్రెస్ పార్టీతో ఆసక్తి నెలకొంది. అయితే పార్టీలో ఉండాలా.. వద్దా అని అభిప్రాయాలను నేతలు, అనుచరులు, కార్యకర్తల నుంచి తెలుసుకోనున్నారు జగ్గారెడ్డి.

 

Read more RELATED
Recommended to you

Exit mobile version