బ్రేకింగ్‌ : “భీమ్లా నాయక్” ట్రైలర్ డేట్ ఫిక్స్‌..ఇక పవన్‌ ఫ్యాన్స్ కు జాతరే

-

Bheemla Nayak: పవర్ స్టార్ పవన్ కళ్యాణ్, రానా దగ్గుబాటి ప్రధానపాత్రల్లో నటించిన ‘భీమ్లా నాయక్. మలయాళంలో సూప‌ర్ హిట్ అయిన‌ ‘అయ్యప్పనుమ్ కోశియమ్స‌కు ఈ చిత్రం రీమేక్ గా తెరకెక్కుతుంది. ఈ సినిమాలో పవన్ కల్యాణ్ పోలీస్ అధికారిగా నటిస్తోండ‌గా.. నెగిటివ్ క్యారెక్ట‌ర్లో రానా దగ్గుబాటి కనిపించనున్నారు. అలాగే ఈ చిత్రంలో నిత్యామేనన్, సంయుక్త మేనన్ హీరోయిన్లు న‌టించ‌నున్నారు.

ఈ చిత్రానికి తమన్ సంగీతమందిస్తుండ‌గా.. సాగర్ కె చంద్ర దర్శకత్వం వహిస్తున్నారు. ఇక ఇప్పటికే ఈ సినిమా నుంచి వచ్చిన అప్డేట్స్‌ అందరినీ ఆకట్టుకోగా.. తాజాగా ఈ సినిమా ట్రైలర్‌ డేట్స్‌ ను ఫైనల్‌ చేసింది చిత్ర బృందం. ఫిబ్రవరి 21 వ తేదీన ఈ సినిమా ట్రైలర్‌ విడుదల కానుంది.

ఈ మేరకు ఓ పోస్టర్‌ ను కూడా విడుదల చేసింది. ఈ పోస్టర్‌ లో బైక్‌ పైన వస్తున్న పవన్‌ కళ్యాణ్‌ … చాలా పవర్‌ ఫుల్‌ లో కనిపిస్తున్నారు. కాగా.. ఈ సినిమా ప్రీ రిలీజ్‌ ఈవెంట్‌ కూడా ఫిబ్రవరి 21 వ తేదీన యూసఫ్‌ గూడలో జరుగనుంది. అలాగే.. ఈ మూవీ ఫిబ్రవరి 25 వ తేదీన వరల్డ్‌ వైడ్‌ గా విడుదల కానుంది.

Read more RELATED
Recommended to you

Latest news