మెగాస్టార్ చిరంజీవి లీడ్ రోల్లో నటించిన లేటెస్ట్ మూవీ ‘భోళాశంకర్’. ఫ్యామిలీ అండ్ మాస్ ఎంటర్టైనర్గా తెరకెక్కిన ఈ సినిమా ఇవాళ ప్రేక్షకుల ముందుకు వచ్చింది. ఈ సినిమాకు ప్రేక్షకులు బ్రహ్మరథం పడుతున్నారు. ఈ క్రమంలో తెలుగులో ఈ సినిమా షోలకు బుకింగ్స్ సైతం బాగా పెరుగుతున్నాయని టాక్. దీంతో ఓపెనింగ్స్ కూడా బాగానే వచ్చే ఛాన్స్ ఉందని ట్రేడ్ వర్గాలు అంటున్నాయి. అయితే తాజాగా ఈ చిత్రానికి సంబంధించి ఓ సూపర్ న్యూస్ నెట్టింట వైరల్ అవుతోంది.
ఈ మూవీపై క్రియేట్ అయిన హైప్‌తో డిజిటల్ స్ట్రీమింగ్ హక్కులను ఎవరు సొంతం చేసుకుంటారన్న విషయంపై సందిగ్ధత నెలకొంది. అయితే ఎట్టకేలకు ప్రముఖ దిగ్గజ ఓటీటీ సంస్థ నెట్‌ఫ్లిక్స్ సంస్థ ఈ సినిమా డిజిటల్ రైట్స్‌ను కొనుగోలు చేసినట్లు మూవీ మేకర్స్ తెలిపారు. ‘భోళా శంకర్’ టైటిల్ కార్డ్స్‌పై వేసి ఆ విషయంపై క్లారిటీ ఇచ్చింది. సినిమా థియేటర్లలో విడుదలైన 30 రోజుల తర్వాతనే ఓటీటీలో స్ట్రీమింగ్ చేసేలా నిర్మాతలు ఒప్పందం చేసుకున్నారట. దాని ప్రకారం ఈ సినిమా సెప్టెంబర్ 2వ వారంలో స్ట్రీమింగ్కు వస్తుందనే టాక్ జోరుగా వినిపిస్తోంది.